పవన్ తర్వాత చెర్రీ: 'బ్రెయిన్ ట్యూమర్' బాలుడి వద్దకు
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ బాబాయి బాటలో నడుస్తున్నారు! ప్రాణాపాయస్థితిలో ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీజ అనే బాలికను జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. తాజాగా చెర్రీ కూడా రాహుల్ అనే బాలుడిని కలిశారు.
రామ్ చరణ్ తేజ రెండు రోజుల క్రితం బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న పదేళ్ల రాహుల్‌ను కలిశాడు. తనకు రామ్ చరణ్ తేజని చూడాలని ఉందని బాలుడు కోరాడు. దీంతో ప్రత్యూష ఫౌండేషన్ ఈ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని చెర్రీ దృష్టికి తీసుకు వెళ్లింది. దీంతో చెర్రీ రాహుల్ వద్దకు వచ్చి అరగంట పాటు మాట్లాడాడు. దీంతో అతని ముఖం సంతోషంతో వెలిగిపోయింది. రామ్ చరణ్ రాహుల్‌కు ఏం ఇచ్చారో తెలియరాలేదు.
కాగా, జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే.

శ్రీజను చూసిన పవన్ కంటతడి పెట్టారు. పవన్ కళ్లు చెమర్చాయి. అక్కడున్నంత సేపు ఆయన ఆవేదనగా కనిపించారు. శ్రీజ పరిస్థితిను చూసి చలించిపోయారు. పవన్ ఆసుపత్రికి వస్తుండని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనను చూసేందుకు తరలి వచ్చారు.
శుక్రవారం ఉదయం ఖమ్మం చేరుకున్న పవన్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీజ ఉంటున్న రూంలోకి వెళ్లి, బెడ్ పక్కనే అలాగే నిలుచుండి పోయారు. పవన్ రాగానే శ్రీజ కుటుంబ సభ్యులు కూడా కంటతడి పెట్టారు. ఇది అక్కడున్న వారినందరినీ కదిలించింది. శ్రీజ స్పందించే స్థితిలో లేకపోవడంతో పవన్ నిరాశ, ఆవేదనకు గురయ్యారు. నీకోసమే వచ్చానని పలుమార్లు శ్రీజ చెవి వద్ద చెప్పారు.


Click it and Unblock the Notifications











