పబ్ వివాదం తర్వాత నిహారిక దర్శనం.. భర్తతో కలిసి అలా రూమర్లకు చెక్

ఇటీవల హైదరాబాదులో ఒక పబ్ లో నిబంధనలకు విరుద్ధంగా రేవ్ పార్టీలను నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ పార్టీలో కూడా డ్రగ్స్ వాడినట్లుగా కేసులు నమోదయ్యాయి. అయితే అదే పార్టీలో కొంతమంది టాలీవుడ్ హీరోల ఫ్యామిలీ లకు చెందిన వారు కూడా ప్రత్యక్షమవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిహారిక కొణిదెల కూడా అదే రోజు ఆ పార్టీలో ఉండగా ఒక్క సారిగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక వివాదం అనంతరం చాలా రోజులకు నిహారిక భర్తతో దర్శనమిచ్చి గతంలో వచ్చిన రూమర్స్ కు కూడా పెట్టేసింది.

పెళ్లి తరువాత

పెళ్లి తరువాత

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతో మంచి నటిగా గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పలు టెలివిజన్ రియాలిటీ షోలలో కూడా యాంకర్ గా కనిపించిందిమ్ ఇక పెళ్లి అనంతరం ఆమె నటనకు కాస్త దూరం అయింది అని చెప్పాలి. ఎక్కువగా ఫామిలీ లైఫ్ తోనే బిజీ అయినట్లు తెలుస్తోంది.

 భర్తతో విబేధాలు..?

భర్తతో విబేధాలు..?

ఇక నిహారిక పెళ్లి అనంతరం సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె హఠాత్తుగా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయడంతో ఆ విషయంలో కూడా అనేక రకాల అనుమానాలు వెలువడ్డాయి. ఆమెకు భర్తతో విభేదాలు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయని అంతేకాకుండా తన భర్త చైతన్యకు దూరమైనట్లు కూడా టాక్ వచ్చింది.

పబ్ వివాదంలో..

పబ్ వివాదంలో..

ఇక రీసెంట్ గా హైదరాబాద్ పబ్ వివాదంలో కూడా నిహారిక పేరు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించిన పబ్ లో తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇక అందులో పాల్గొన్న చాలా మంది సెలబ్రిటీలను కూడా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇక నిహారిక ను కూడా అదుపులోకి తీసుకోగా వెంటనే ఆమెని విచారణ జరిపి విడుదల చేశారు. ఆ విచారణపై కూడా నాగబాబు వెంటనే వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చి ఎలాంటి కేసు నమోదు అవ్వలేదని తెలియజేశారు.

అలా రూమర్స్ కు చెక్

అలా రూమర్స్ కు చెక్

చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ అప్డేట్ తో నిహారిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆమె భర్తతో విడిపోయినట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టె విధంగా పాటోస్ పోస్ట్ చేసింది. నిహారిక తన భర్తతో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించిన విషయం తెలిసిందే. అందులోనే పలు వెబ్ సిరీస్ లను కూడా నిర్మించే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఆమె మరొక కొత్త ప్రాజెక్టును కూడా మొదలుపెట్టి అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకునే.

న్యూ ప్రాజెక్ట్

న్యూ ప్రాజెక్ట్

ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఒక కొత్త ప్రాజెక్ట్ ను యంగ్ జనరేషన్ టెక్నీషియన్స్ తో కలిసి నిహారిక అలాగే ఆమె భర్త చైతన్య నిర్మించేందుకు సిద్ధమయ్యారు. హలో వరల్డ్ అనే ఒక డిఫరెంట్ వెబ్ కంటెంట్ ను నిర్మిస్తున్న నిహారిక ఆ ప్రాజెక్టును జి ఫైవ్ లో విడుదల చేయనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన లాంచ్ వేడుకను నేడు వారి ఆఫీసులోనే నిర్వహించారు.

 ఫొటోస్ వైరల్

ఫొటోస్ వైరల్

పబ్ వివాదం తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో కూడా స్పందించని నిహారిక మళ్ళీ ఇన్నాళ్ళకు తన భర్తతో అలాగే తన టీంతో కలిసి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ ప్రాజెక్టు తో నిహారిక ఎలాంటి గుర్తింపు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X