»   » హీరోయిన్ కత్రినా కైఫ్ కనబడుట లేదట, అసలు ఏమైంది?

హీరోయిన్ కత్రినా కైఫ్ కనబడుట లేదట, అసలు ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య రాహుల్ గాంధీ, ఇటీవల రష్యా ప్రధాని పుతిన్ కనిపించడం లేదంటూ రూమర్స్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కనిపించడం లేదంటూ పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయం విని పలువురు ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండగా.... మరికొందరు మాత్రం ఆమె మళ్లీ భారత్‌కు తిరిగి రావొద్దు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ కత్రినా కైఫ్ ఏమైంది? అనే విషయం తెలియరావడం లేదు. ఆమె మేనేజర్ కూడా కాంటాక్టులోకి రావడం లేదు. రెండు మూడు రోజుల్లో ఏ విషయం అనేది తేలనుంది.

After Rahul Gandhi Now Katrina Kaif Goes Missing

ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్ మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సైఫ్ అలీ ఖాన్ తో కలిసి కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘ఫాంటమ్' అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు రణబీర్ కపూర్, గోవిందాతో కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో జగ్గా జాసోస్ చిత్రంలో నటిస్తోంది.

కత్రినా కైఫ్ నటిస్తున్న మరో చిత్రం ఫితూర్ చిత్రీకరణ దశలో ఉంది. కత్రినా కైఫ్, ఆదిత్య కపూర్ జంటగా ‘ఫితూర్' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే.

English summary
Rumour is that Bollywood actress Katrina Kaif has gone missing. Apparently all attempts to reach her or her manager have failed.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu