ఆ గౌరవం దక్కించుకున్న రెండో నటుడు.. ప్రభాస్ రేంజ్ మామూలుగా లేదే
ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో భారత సినీ పరిశ్రమకు ప్రతినిధిగా చూస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రభాస్ స్థాయి ఉంది. బాహుబలి సినిమాలతో ప్రభాస్ దేశ విదేశాల్లో అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. జపాన్‌లో అయితే ప్రభాస్‌కు ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా.. ఆ సినిమాల్లో ప్రతీ పాత్రకు అభిమానులున్నారు. అంతలా అందరి మనసులు దోచుకున్న బాహుబలి ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటో ఓ సారి చూద్దాం.

అంతర్జాతీయ స్థాయిలో..
బాహుబలి సినిమా భారత సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. రెండు వేల కోట్లను కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశ విదేశాల్లో బాహుబలి కొత్త రికార్డులను క్రియేట్ చేసిండి. లండన్ హాల్ ఆఫ్ ఫ్రేమ్‌లో బాహుబలిని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

తాజాగా మరో గౌరవం..
రష్యాలోని ప్రేక్షకులను మెప్పించిన చిత్రానికి అక్కడి ప్రభుత్వం ఓ అవార్డును ప్రకటిస్తుంది. తాజాగా ఆ అవార్డు ప్రభాస్‌ను వరించింది. గతకొన్ని రోజుల క్రితం రష్యా లోకల్ చానెల్‌లో బాహుబలి సినిమా ప్రసారమైందని రష్యన్ ఎంబసీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

రెండో నటుడుగా..
అద్భుతమైన నటుడు రాజ్ కపూర్, దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే అవార్డును అందుకున్నాడు. అప్పటి నుంచి మరే ఇతర ఇండియన్ యాక్టర్స్ ఈ అవార్డును సొంతం చేసుకోలేకపోయారు. 'శ్రీ 420', 'ఆవారా', 'ఆరాధన' వంటి చిత్రాలతో రష్యా సినీ అభిమానులను మెప్పించాడు రాజ్ కపూర్.
Recommended Video

ప్రభాస్ రేంజ్..
మళ్లీ ఇన్నేళ్లకు ఆ అవార్డును భారత నటుడు అందుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ రేంజ్ అది అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. బాహుబలి వచ్చి పోయినా రికార్డుల వేట మాత్రం ఆగడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











