రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో హాట్ హీరోయిన్
బెంగుళూరు: కన్నడ హీరోయిన్ల దృష్టంతా రాజకీయాలపైనే ఉన్నట్టుంది. ఇటీవల హీరోయిన్ రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ రాగిణి ద్వివేది కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తోంది. తమ పార్టీలకు హీరోయిన్ల గ్లామర్ అద్దేందుకు పలు రాజకీయ పార్టీల కూడా పోటీ పడుతుండటం గమనార్హం.
రాగిణి ద్వివేదికి కర్నాటకలోని మూడు ముఖ్యమైన పార్టీల నుండి ఆహ్వానం అందింది. 2014లో జరిగే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే సినిమా తారలకు గాళం వస్తున్నాయి రాజకీయ పార్టీలు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మూవీ 'ఆర్...రాజ్ కుమార్'లో ఐటం సాంగు చేయడంతో రాగిణి ద్వివేది నేషనల్ ఫిగర్ అయిపోయిందని, అందుకే ఆమెతో ప్రచారం చేయించడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నట్లు టాక్.
ఈ విషయమై రాగిణి ద్వివేది మాట్లాడుతూ...'నాకు మూడు రాజకీయ పార్టీల నుండి ఆహ్వానం అందడం నిజమే. కానీ ఏ పార్టీలో చేరాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వివిధ బాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను' అని తెలిపింది.
రాగిణి ద్వివేది వాలకం చూస్తుంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేట్లే ఉంది. ఈ అమ్మడుతో త్వరలో తెలుగు తెరపై కనిపించబోతోంది. నాని హీరోగా తెరకెక్కిన 'జెండాపై కపిరాజు' చిత్రంలో రాగిణి ద్వివేది నటించింది. దీంతో పాటు పలు కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది ఈ కన్నడ బ్యూటీ.


Click it and Unblock the Notifications












