నేనే విజయ్ దేవరకొండ అయితే.. లిప్‌లాక్ సీన్స్ గురించి హీరోయిన్ హాట్ కామెంట్స్!

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీ కానున్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాలు ఒకెత్తయితే.. అతడి లిప్ లాక్ సీన్స్ మరో ఎత్తు. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే రొమాన్స్ హాట్ టాపిక్ గా నిలిచింది. గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య కెమిస్ట్రీకి యువత ఫిదా అయ్యారు. వీరిద్దరో జంటగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నా వ్యాఖ్యలతో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది.

డియర్ కామ్రేడ్ చిత్రంలో

డియర్ కామ్రేడ్ చిత్రంలో

విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం చివరి దశకు చేరుకుంది. మైత్రి మూవీస్ నిర్మాణంలో భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంతో మరోమారు రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. టీజర్ లో విజయ్, రష్మిక ఘాటైన లిప్ లాక్ తో హీటెక్కించారు. ఈ లిప్ లాక్ రష్మికపై అనేక విమర్శలకు కూడా కారణం అయింది.

క్రాంతి మాధవ్ దర్శత్వంలో

క్రాంతి మాధవ్ దర్శత్వంలో

డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్సకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నా నటించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా ఈ చిత్రం గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. విశాల్ నటించిన అయోగ్య చిత్రం విడుదల సిద్ధం అవుతున్న నేపథ్యంలో రాశి ఖన్నా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడింది.

నేనే విజయ్ దేవరకొండ అయితే

నేనే విజయ్ దేవరకొండ అయితే

ఇంటర్వ్యూలో రాశి ఖన్నాకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఒకవేళ మీరే విజయ్ దేవరకొండ అయితే ఏ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ లో నటిస్తారు అని అడగగా.. నా నెక్స్ట్ సినిమా హీరోయిన్ ని అని రాశి ఖన్నా సమాధానం ఇచ్చింది. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది రాశి ఖన్నానే. రాశి ఖన్నా వ్యాఖ్యలతో క్రాంతి మాధవ్ తెరకెక్కించే చిత్రంలో కూడా ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం యువతకు

ప్రస్తుతం యువతకు

విజయ్ దేవరకొండ గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న యువతని ప్రతిభింబించే వ్యక్తి విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఉన్న జనరేషన్ విజయ్ దేవరకొండ వ్యక్తిత్వాన్ని, రొమాంటిక్ సన్నివేశాల్ని ఆమోదిస్తోంది. కాబట్టి సినిమాల్లో రొమాన్స్ పెద్ద విషయం కాదంటూ రాశి ఖన్నా పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. రాశి ఖన్నాతో ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X