మాఫియా బెదిరింపులు: భయం గుప్పిట్లో సినీ స్టార్స్

By Bojja Kumar

ముంబై: ముంబై అండర్ వరల్డ్ మాఫియా మళ్లీ రెచ్చి పోతోంది. సినీ తారలను టార్గెట్ చేస్తూ వారిని భయ భ్రాంతులకు గురి చేస్తోంది. బాలీవుడ్ మూవీ ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో నటిస్తున్న షారుక్ ఖాన్, బోమన్ ఇరానీలకు ఇటీవల మాఫియా డాన్ రవి పుజారి గ్యాంగ్ నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా నటుడు సోను సూద్‌ను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.

రవి పుజారి గ్యాంగ్ ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో నటిస్తున్న వారినే టార్గెట్ చేయడం వెనక ఓ బలమైన కారణం వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కరిమ్ మోరానీతో ఓ విషయంలో రవి పుజారి విబేధించారని సమాచారం. ఈ క్రమంలోనే నిర్మాత ఇంటిపై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారు.

After Shahrukh Khan, Ravi Pujari Now Threatens Sonu Sood

ఇంతటితో ఆగకుండా ‘హ్యాపీ న్యూ ఇయర్' సినిమాలో నటిస్తున్న నటీనటులకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తోంది రవి పూజారి గ్యాంగ్. ఈ నేపథ్యంలో సదరు నటీనటుల ఇంటి వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసారు. ఆయుధాలు కలిగిన పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో సంచరిస్తూ రవి పుజారి గ్యాంగ్‌పై నిఘా పెట్టారు.

ఒకప్పుడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహం ముంబైలో ఇలాంటి చర్యలకు పాల్పడి....పలు దారుణాలకు పాల్పడ్డాడు. చాలా కాలం తర్వాత మళ్లీ ముంబైలో మాఫియా ఆగడాలు వెలుగులోకి రావడం, బెదిరింపులకు పాల్పడటం సినీ రంగానికి చెందిన వారిని భయం గుప్పిట్లోకి నెట్టి వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X