ఒళ్లు తుడుచుకుంటూ..: వెబ్‌సైట్లో పూనం అందాలు
భారత్ ప్రపంచ కప్ గెలిస్తే స్టేడియంలో తన బట్టలు విప్పుతానని ప్రకటించిన ప్రముఖ మోడల్ పూనమ్ పాండే మరోసారి హాట్ హాట్ న్యూస్‌తో వార్తల్లోకెక్కింది. చేతిలో సినిమాలు, రియాల్టీ షోలు లేక పోవడంతోతన అభిమానులను ఉర్రూతలూగించడానికి కొత్త పంథా ఎంచుకుంది. ఏకంగా తాను స్నానం చేసిన తర్వాత టవల్‌తో తుడుచుకునే దగ్గరి నుండి మేకప్ వేసుకునే వరకు అన్ని దృశ్యాలను తనకు తానే చిత్రీకరించుకొని ఓ వెబ్ సైట్లో పెట్టింది. ఈ చిత్రం నిడివి మూడున్నర నిమిషాలకు పైగా ఉంది. మిర్రర్ యాక్ట్ షో పేరుతో దానిని వెబ్ సైట్లో పెట్టింది.
స్నానం అనంతరం టవల్‌తో బాత్ రూం నుండి బయటకు రావడం, తుడుచు కోవడం, శరీర భాగాలకు స్లో మోషన్‌తో లోషన్ రాసుకోవడం, అద్దం వైపు వెళ్లి మేకప్ చేసుకోవడం తదితర వాటిని వెబ్ సైట్లో పెట్టింది. అంతేకాదు తనకు తానుగానే పదహారు చిత్రాల ఆఫర్లను తిరస్కరించానని ట్వీట్ చేసింది. అయితే వెబ్ సైట్లో పూనమ్ హాట్ వీడియో చూద్దామనుకునే వారిలో చాలా మందికి నిరాశ ఎదురవుతుందట. కాగా ట్రయలర్ తన వెబ్ సైట్లో పెట్టడం విశేషం.


Click it and Unblock the Notifications











