శ్రీదేవి, జయప్రద తర్వాత నేనే...జెనీలియా
శ్రీదేవి, జయప్రద తర్వాత ఓ పక్క దక్షిణాదిలో, మరో పక్క ఉత్తరాదిలో సమానమైన స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ ను నేను మాత్రమే అని సగర్వంగా చెప్పుకుంటా అని చెప్తోంది జెనీలియా..'బొమ్మరిలు' చిత్రంలో ఆమె పోషించిన హాసిని పాత్రని హిందీ, తమిళ, కన్నడ రీమేక్ చిత్రాల్లో ఆమే చేశారు. ఆ విషయం ప్రస్దావిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. "ఇది అరుదుగా మాత్రమే లభించే అదృష్టం...అయినా నాకు పేరు తెచ్చిన పాత్రలన్నీ..నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్నవే. నా మనసుకు నచ్చి నేను ఏ పాత్ర అయినా చేయడానికి అంగీకరించానంటే...ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసేదాకా నిద్రపోను. పాత్రకు న్యాయం చేస్తున్నానో, లేదో చేసేటప్పుడే నాకర్థమైపోతుంది. అందుకే ప్రాణం పెట్టి చేస్తాను అందుకే అవి అలా క్లిక్ అవుతాయి..వేరే వారిని రీమేక్ లలో ఊహించుకోలేరు అని చెప్తోంది. ప్రస్తుతం జెనీలియా..రామ్ చరణ్ సరసన ఆరెంజ్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











