డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్.. హీరోయిన్‌తో షూటింగ్‌లో బిజీగా ఉండగా సడన్ షాక్!
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు తేజ కూడా కరోనా భారిన పడ్డారు. ఇప్పటికే పలువురు దర్శకులు, నటులు కరోనా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కోగా సడన్ గా తేజా కూడా ఆ లిస్ట్ లో చేరడం హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్ లో ఉండగానే తేజ కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వెంటనే హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

షూటింగ్ లో ఉండగానే..
గత కొన్ని రోజులుగా దర్శకుడు తేజ ఒక వెబ్ సిరీస్ ని షూట్ చేస్తున్నాడు. నందిని రాయ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా రెస్ట్ లేకుండా పని చేస్తున్నట్లు టాక్. అయితే మొన్న కొంత దగ్గు రావడంతో దర్శకుడు తేజ వెంటనే కరోనా పరీక్షలు చేయించారు. ఇక కొద్దీ సేపటి క్రితమే ఆయనకు పాజిటివ్ అని రిపోర్ట్స్ అందాయి.

కుటుంబ సబ్యులకు నెగిటివ్
కోవిడ్ 19 పరీక్షల్లో పాజిటివ్ అని నిర్దారణ కాగానే దర్శకుడు తేజ వెంటనే హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఫిల్మ్ నగర్ లో తన ఇంట్లోనే ఉంటూ పర్సనల్ డాక్టర్ల సలహాలతో చికిత్స తీసుకుంటున్నారు. ఇక కుటుంబ సబ్యులకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఇక తేజ ఆటోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. కరోనా లక్షణాలు కొద్దీగా ఉన్నట్లు సమాచారం.

ఆరోగ్య పరిస్థితి..
వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్న తేజకు కరోనా రావడంతో షూటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోని క్వారంటైన్ లోకి వెళ్లాలని దర్శకుడు వివరించినట్లు తెలుస్తోంది. ఇక విషయం తెలియగానే సినీ ప్రముఖులు తేజ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఆయనకు గ్యాప్ లేకుండా ఫోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దర్శకుడు తేజ సమాధానం ఇస్తున్నారు.

ఆయన కోలుకోవాలని
మొన్న దర్శకుడు రాజమౌళి కూడా కరోనా వైరస్ భారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు రాజమౌళి ఇంట్లో సగం మందిని కరోనా ఇబ్బంది పెట్టినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు సడన్ గా తేజ కూడా కరోనా వైరస్ భారిన పడటం అందరిని షాక్ కి గురి చేసింది. ఆయన వెంటనే కోలుకోవాలని అభిమానులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











