కెరీర్‌లో చైతు తొలిసారి.. ఉత్కంఠ పెంచుతోన్న 'మహా సముద్రం'.. హీరోయిన్ చుట్టూ!

Recommended Video

Naga Chaitanya Playing Cop Role In His Next Movie With RX 100 Director || Filmibeat Telugu

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ మంచి విజయం సాధించింది. మజిలీ చిత్రంతో నాగ చైతన్య చాలా రోజుల తర్వాత ఓ విజయం అందుకున్నాడు. మజిలీ చిత్రం నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇదే ఉత్సాహంతో చైతు తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. నాగ చైతన్య తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

మంచి విజయం

మంచి విజయం

వివాహం తర్వాత చైతు, సమంత తొలిసారి జంటగా నటించిన చిత్రం మజిలీ. సవ్యసాచి, యుద్ధం శరణం, శైలజారెడ్డి అల్లుడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో నాగ చైతన్యకు ఓ హిట్ అవసరం అన్న కీలక తరుణంలో మజిలీ విజయాన్ని అందించింది. వసూళ్ల పరంగా కూడా మజిలీ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య తదుపరి చిత్రం ఏ దర్శకుడితో ఉంటుందనే ఆసక్తి నెలకొంది.

అజయ్ భూపతి దర్శకత్వంలో

అజయ్ భూపతి దర్శకత్వంలో

గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలైన ఆర్ఎక్స్ 100 చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంతో దర్శకుడు అజయ్ భూపతికి మంచి గుర్తింపు లభించింది. ఆర్ఎక్స్ 100 విజయం తర్వాత అజయ్ భాపతి తన కొత్త చిత్రం ప్రారంభించలేదు. పలువురు హీరోలతో అజయ్ సంప్రదింపులు జరుపుతున్న తరుణంలో నాగ చైతన్య ఈ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కెరీర్‌లో తొలిసారి

కెరీర్‌లో తొలిసారి

అజయ్ భూపతి, నాగ చైతన్య కాంబోలో తెరకెక్కే చిత్రానికి క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి 'మహా సముద్రం'అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కెరీర్ లో తొలిసారి నాగ చైతన్య ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటించబోతున్నాడట. ఓ గ్యాంగ్ స్టర్ కు , నాగ చైతన్యకు మధ్య మైండ్ గేమ్ ని దర్శకుడు అజయ్ భూపతి ఉత్కంఠభరితంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్ పాత్ర చుట్టూ

హీరోయిన్ పాత్ర చుట్టూ

మహా సముద్రంలోని కథ హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతుందట. మహా అనేది ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పేరని అంటున్నారు. కథకు తగ్గట్లుగా అద్భుతంగా నటించగలిగే హీరోయిన్ కోసం దర్శకుడు వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మరో రూమర్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సమంతని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవమో అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X