తుపాకి తర్వాత... పవన్ కళ్యాణ్‌తో మురుగదాస్
ప్రముఖ పత్రిక కథనం ప్రకారం.... మురుగదాస్‌తో కలిసి పని చేయడానినికి పవన్ కళ్యాణ్ అంగీకరించారని, ఈ భారీ చిత్రాన్ని బడా నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బేనర్‌పై తెరకెక్కించబోతున్నట్లు టాక్. ప్రస్తుతం మురుగదాస్ పవన్ తో చేయబోయే సినిమాకు సంబంధించి స్క్రిప్టు రాసుకోవడంలో బిజీ అయిపోయారట.
ఆసంగతి పక్కన పెడితే... పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాకు సిద్దం అయ్యారు. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 23న హైదరాబాద్ లోని ఓ దేవాలయంలో జరిగింది. తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం త్రివిక్రమ్‌తో సినిమా పూర్తయిన తర్వాత మురుగదాస్ తో కలిసి పవన్ పని చేయనున్నారు.
ఇక మురుగదాస్ తుపాకి చిత్రం వివరాల్లోకి వెళితే...దీపావళికి విడుదలైన ఈచిత్రం తెలుగు, తమిళంలో విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈచిత్రం రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు దర్శకుడు మురుగదాస్ ఇటీవల తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












