త్రివిక్రమ్, కొరటాల శివ బాటలో మరో స్టార్ రైటర్. త్వరలో ప్రకటన!
తక్కువ సమయంలో మంచి సంభాషణలు రాసి పాపులర్ అయిన రచయితల్లో బుర్రా సాయి మాధవ్ ఒకరు. రైటర్ గా సాయిమాధవ్ ఖాతాలో కంచె.. గోపాల గోపాల.. ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి భారీ సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రైటర్ మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు మాటలు రాస్తున్నారు.
తాజా సమాచారం మేరకు బుర్రాసాయిమాధవ్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో సాయిమాధవ్ డైరెక్షన్‌లో సినిమా తీసేందుకు పెద్ద ప్రొడ్యూసర్ ఒకరు రెడీగా ఉన్నాడుట. త్వరలో ఈ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సాయిమాధవ్ ఎన్టీఆర్ బయోపిక్, ఇతర ప్రాజెక్టుల స్క్రిప్ట్ వర్క్స్‌లో బిజీగా ఉన్నారు.

గతంలో రచయితలు దర్శకులుగా మారి మంచి విజయాలు సాధించారు. త్రివిక్రమ్, కొరటాల శివ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదే విధంగా బుర్రా సాయిమాధవ్ సక్సెస్ ఫుల్ రైటర్‌తో పాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడని కోరుకుందాం. బుర్రా సాయి మాధవ్ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











