జూనియర్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా మూవీ.. త్రివిక్రమ్ తరువాత అతనితోనే?

సౌత్ ఇండియన్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే.. అందులో జూనియర్ ఎన్టీఆర్ టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు. డ్యాన్స్, యాక్టింగ్, స్టైల్.. ఇలా అన్ని కోణాల్లో బెస్ట్ అనిపించుకునే తారక్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కష్టపడి స్టార్ హీరోగా తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ సెట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ RRR సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే.

 RRR క్రేజ్..

RRR క్రేజ్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ అయితే తారక్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. 450కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా ఇతర భాషల్లో కూడా భారీగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

 అందరి చూపు తారక్ వైపే..

అందరి చూపు తారక్ వైపే..

ఇక సౌత్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అగ్ర దర్శకులు జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ట్రై చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తారక్ కి కథలు చెప్పాలని కాంటాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక సిట్టింగ్ కూడా వేశాడు. అలాగే తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా పలుమార్లు తారక్ తో సంప్రదింపులు జరిపాడు.

RRR రైటర్ సాయంతో..

RRR రైటర్ సాయంతో..

రాజమౌళి తండ్రి, RRR రైటర్ విజయేంద్ర ప్రసాద్ సాయంతో అట్లీ జూనియర్ ఎన్టీఆర్ కి కథ వినిపించినట్లు తెలుస్తోంది. గతంలో అట్లీ మెర్షల్ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేశారు. అప్పుడే వారిద్దరికీ మంచి బాండింగ్ ఏర్పడింది. అట్లీ దగ్గర మరొక కథ ఉందని తెలుసుకున్న విజయేంద్రప్రసాద్ ఆ స్టోరీకి జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ గా సెట్టవుతుందని సలహా ఇవ్వడంతో కాంబినేషన్ సెట్టవ్వడానికి దారితీసినట్లు తెలుస్తోంది.

Recommended Video

NTR31 Film With Atlee, Will Be Another Big Pan India Movie
త్రివిక్రమ్ తరువాత..

త్రివిక్రమ్ తరువాత..

RRR సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో తన 30వ ప్రాజెక్ట్ ని పూర్తి చేయనున్నాడు. ఇక 31వ సినిమాను అట్లీతోనే చేసే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు అట్లీ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో సినిమా చేయాలని ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కాంబినేషన్ పై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఇక ఎన్టీఆర్ అట్లీ కాంబినేషన్ లో రానున్న సినిమా మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X