యూఎస్ఏ టూర్ తర్వాత ‘కాటమరాయుడు’ సెట్లో పవన్ ఇలా... (ఫోటోస్)

హార్వర్డ్ యూనివర్శిటీలో జరిగిన సదస్సులో పాల్గొని తిరిగి హైదరాబాద్ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ షూటింగులో బిజీ అయ్యారు.

By Bojja Kumar

హైదరాబాద్: హార్వర్డ్ యూనివర్శిటీలో జరిగిన సదస్సులో పాల్గొని తిరిగి హైదరాబాద్ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' షూటింగులో బిజీ అయ్యారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ కి దర్శకుడు డాలీ సీన్స్ వివరిస్తున్నట్లు ఫోటోల్లో ఉంది.

సినిమా షూటింగులో భాగంగా డైనింగ్ టేబుల్ వద్ద తమ్ముళ్లతో కలిసి కాటమరాయుడు భోజనం చేస్తున్న సీన్లను తాజాగా చిత్రీకరించారు. ఈ నెలలో షూటింగ్ పూర్తి చేసిన వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ముందనుకున్నట్లుగా మార్చి 28న ఉగాది రోజు కాకుండా అంతకు ముందే అంటే... మార్చి 24నే 'కాటమరాయుడు' విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

 ఉత్సాహంగా ఉన్న టీం

ఉత్సాహంగా ఉన్న టీం

'' 'కాటమరాయుడు' టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ప్రచార చిత్రానికి వచ్చిన స్పందన మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అంతకు పదింతలు 'కాటమరాయుడు' వినోదాన్ని అందిస్తాడు. మార్చిలోనే పాటల్ని విడుదల చేస్తాము. మార్చి 10 నాటికి పోస్టు ప్రొడక్షన్ పనులు సహా సినిమా పూర్తవుతుంది. 'అని దర్శక నిర్మాతలు తెలిపారు.

 నితిన్ దక్కించుకున్నాడు

నితిన్ దక్కించుకున్నాడు

మరో ప్రక్క 'కాటమరాయుడు' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను హీరో నితిన్‌ సొంతం చేసుకోవటంతో బిజినెస్ సర్కిల్స్ లో సినిమాపై క్రేజ్ రెట్టింపైంది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ చిత్రం నైజాం హక్కులు ఇరవై కోట్లకి తీసుకున్నారని తెలుస్తోంది.

 ఈజీగా వస్తాయి

ఈజీగా వస్తాయి

ఆ ఇరవై కోట్లలో రెండు కోట్లు రికవరబుల్‌ అని తెలిసింది. అంటే లెక్క ప్రకారం...ఈ సినిమాపై నితిన్‌ ప్లస్‌ ఏషియన్‌ వాళ్ల రిస్క్‌ పద్ధెనిమిది కోట్లు. సగం ఏషియన్ వాళ్లు షేర్ చుసుకంటారు కనుక నితిన్‌ పై తొమ్మిది కోట్లు రికవరీ భాధ్యత ఉంటుంది. అయితే సినిమా ఓ మోస్తరుగా ... యావరేజ్‌ టాక్ తెచ్చుకున్నా ఈ అమౌంట్‌ తిరిగి వచ్చేస్తుంది.

rn

అఫీషియల్ టీజర్


ఇక 'కాటమరాయుడు' చిత్రం టీజర్‌కు యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. 'ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం' అంటూ ఫిబ్రవరి 4న విడుదల చేసిన ఈ టీజర్‌ ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌ లిస్టులో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X