‘జిల్’ సినిమా చూసి ఎగ్జైట్ అయిన ప్రభాస్
హైదరాబాద్: గోపీచంద్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘జిల్' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రభాస్ చిన్ననాటి స్నేహితులైన వంశీ, ప్రమోద్ ‘యువి క్రియేషన్స్' బేనర్లో నిర్మించారు. విడుదలకు ముందు ప్రభాస్ కోసం స్పెషల్ షో వేసారు. సినిమా ఔట్ పుట్ చూసి ప్రభాస్ ఎగ్జైట్ అయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
‘జిల్' దాదాపు 700లకుపైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. క్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ జిల్ చిత్రాన్ని రూపొందించాడని, గోపిచంద్ స్టైలిష్ పవర్ ఫుల్ పెర్ ఫర్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ అవుతుందని, గోపిచంద్ ఈ తరహా పాత్రలో ఇప్పటివరకు కనిపంచలేదని నిర్మాతలు తెలిపారు.

గోపిచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే స్టామినా ఉన్న సినిమా ఇది. గోపిచంద్, రాశిఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. గిబ్రాన్ అందించిన పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని వారు అన్నారు.
నటీనటులు - గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక వర్గం పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్ - ఎ.ఎస్.ప్రకాష్, యాక్షన్ డైరెక్టర్ - అనిల్ అరసు, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి - శక్తి శరవణన్, మ్యూజిక్ - జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్ - వి.వంశీ, ప్రమోద్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్.


Click it and Unblock the Notifications











