కనపడితే కొడతాం , 100 పర్సెంట్ పక్కా .. హరీష్ శంకర్‌కు రవితేజ ఫ్యాన్స్ వార్నింగ్
గతేడాది వాల్తేర్ వీరయ్య తర్వాత మరో హిట్ కొట్టేలేకపోయారు మాస్ మహారాజా రవితేజ. ఎన్నో ఆశలు పెట్టుకున్న రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో హరీష్ శంకర్‌తో జతకట్టిన సినిమాయే మిస్టర్ బచ్చన్. షాక్, మిరపకాయ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇదే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ , ట్రైలర్, గ్లింప్స్ , హీరోయిన్ భాగ్యశ్రీ అందాలు మిస్టర్ బచ్చన్‌పై అంచాలను పెంచేశాయి.
నిజాయితీ కలిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తన విధి నిర్వహణలో ఎదుర్కొన్న సవాళ్లే ఇతివృత్తంగా మిస్టర్ బచ్చన్‌ను తెరకెక్కించారు. హిందీలో వచ్చిన రైడ్ సినిమాను తెలుగు నేటివిటిగా అనుగుణంగా మార్చి తన మార్క్ ప్రెజెంటేషన్‌తో ఈ సినిమాను తీశారు హరీశ్ శంకర్. అయితే ఒరిజినల్ కథకు దీనికీ పోలిక ఉండదని.. దాదాపు 70 శాతం మార్పులు చేశామని , లవ్ ట్రాక్ ఎక్కువగా ఉంటుందని డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రమోషన్ కార్యక్రమాల్లోనే క్లారిటీ ఇచ్చారు.

ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కొత్త ప్రపంచంలోకి వెళ్తారని.. పాటలు కలర్‌ఫుల్‌గా ఉంటాయని, డైలాగులను ఎప్పుడూ మరచిపోరని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని తపనపడ్డ రవితేజను ఆడియన్స్ ఆదరించలేదని.. అందుకే మిస్టర్ బచ్చన్‌లో పాత రవితేజను కొత్తగా చూపించానని హరీశ్ తెలిపారు. ఒక ఐటీ ఆఫీసర్ క్యారెక్టర్‌కు సూట్ అయ్యేలా రవితేజ తనని తాను మలచుకున్నారని ప్రశంసించారు.
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా మిస్టర్ బచ్చన్ గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద రవితేజ ఫ్యాన్స్ సందడి చేశారు. చాలా ఏరియాల్లో ప్రీమియర్స్ పడటం, పైగా వరుస సెలవులు కావడంతో అభిమానులు పోటెత్తారు. దీంతో థియేటర్ నుంచి బయటికొస్తున్న ప్రేక్షకులను.. మిస్టర్ బచ్చన్ ఎలా ఉందంటూ మీడియా ప్రశ్నించి వారి ఓపీనియన్ కనుక్కొనే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలోనూ కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్స్ సినిమా గురించి రివ్యూలు ఇస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఓ వ్యక్తి మిస్టర్ బచ్చన్ గురించి చెబుతూ.. తన వరకు యావరేజ్ బొమ్మ అన్నాడు. తాను పక్కా రవితేజ ఫ్యాన్ అని.. హరీశ్ శంకర్ డైరెక్షన్ ఫెయిల్ అయ్యిందన్నాడు. హరీశ్ కనుక ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు వస్తే కొట్టేస్తామంటూ ఊగిపోయాడు. మూవీలో కంటెంట్ ఉంది డైరెక్షన్ మిస్ అయ్యిందని.. పాటల కోసం సినిమా తీశాడా, సినిమా కోసం పాటల తీశాడో అర్ధం కావడం లేదంటూ అతను మండిపడ్డాడు. పాన్ ఇండియా మూవీ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. స్టార్ క్యాస్టింగ్ ఉండి కూడా వాళ్లని సరిగా వాడుకోలేదని ఫైర్ అయ్యాడు. హరీశ్ శంకర్ కనుక ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తే రవితేజ ఫ్యాన్స్ నూటికి నూరు శాతం కొట్టడం గ్యారెంటీ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











