ఓకే దారిలో ప్రభాస్, అనుష్క .. సేమ్ టూ సేమ్ అలా భలే కుదిరిందే?
బయట లైఫ్ లో ఏమో కానీ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం కొంతమంది హీరో హీరోయిన్స్ కి ఉండే క్రేజ్ మరో లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. అలాంటి ఎన్నో కాంబినేషన్ లని మన తెలుగు సినిమా సహా దక్షిణాది సినిమా దగ్గర చూసాం. కానీ ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో అయితే తెలుగు సినిమా దగ్గర ఒక మార్క్ ని సెట్ చేసుకున్న కాంబినేషన్ మాత్రం పాన్ ఇండియా హీరో ప్రభాస్ అలాగే స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి అని చెప్పాలి.
ఈ ఇద్దరూ వేరే వేరేగా సినిమా అరంగేంట్రం చేసినప్పటికీ ఎప్పుడైతే వీరి కలయికలో సినిమాలు వచ్చాయో అక్కడ నుంచి ఆ సినిమాలు ఫలితాలు సంబంధం లేకుండా వీరిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. అలా ఇద్దరూ కూడా తెలుగు సినిమా ఆడియెన్స్ లో ఒక పర్ఫెక్ట్ ఈడు జోడు అంటూ మంచి మార్కులు అందుకున్నారు.

కాగా ప్రభాస్ నటించిన నటించని కొందరితో హీరోయిన్స్ విషయంలో చాలా రూమర్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కానీ అందరిలో కూడా మోస్ట్ ఫెవరెట్ మాత్రం అనుష్క శెట్టితో కాంబినేషన్ నే ఇష్టపడతారు. అయితే ఇద్దరూ కూడా బయట మంచి ఫ్రెండ్స్ మే అని చెబుతారు కానీ ఎక్కడా డేటింగ్ లు రిలేషన్ షిప్ మైంటైన్ చేయడం వంటివి ఎక్కడా కనిపించవు.
కానీ కొన్నిసార్లు మాత్రం పలు అనుమానాలు రేకెత్తక మానవు. అలా కొన్ని నెలలు కితమే ప్రభాస్ నుంచి వచ్చిన ఓ పోస్టర్ కి తగ్గట్టుగానే అదే రంగులో ఉండే డ్రెస్ తో అనుష్క సందర్భం లేకుండానే ఓ పోస్ట్ చేయడం చర్చకి దారి తీసింది. ఇంతకీ అది ఏ సినిమాకి అంటే రీసెంట్ గా దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ చిత్రం "ది రాజా సాబ్" నుంచి రెడ్ కలర్ కోట్ లో డార్లింగ్ కనిపిస్తాడు.
సరిగ్గా ఇది వచ్చిన తర్వాత అదే రంగులో తాను కనిపించే అది కూడా ప్రభాస్ తో నటించిన బాహుబలి 2 సినిమా నుంచి అనుష్క రెడ్ చీరలో పిక్ షేర్ చేసుకోవడం జరిగింది. దీనితో సోషల్ మీడియాలో కొంచెం రచ్చ కూడా నడిచింది. సరే అది యాదృచ్చికం అనుకున్నప్పటికీ కానీ ఇపుడు మళ్ళీ ఇదే ప్యాట్రన్ కనిపిస్తుంది.

ది రాజా సాబ్ నుంచి దసరా కానుకగా వచ్చిన పోస్టర్ తో ప్రభాస్ నుంచి మరో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు. నల్లని దుస్తులు నోట్లో పెద్ద చుట్టో సిగార్ లాంటిది కలుస్తూ పొగలో ఇంటెన్స్ లుక్ ఇస్తున్నట్టుగా డార్లింగ్ కనిపిస్తాడు. కాగా ఇపుడు అనుష్క నటిస్తున్న లేటెస్ట్ సినిమా "ఘాటి" నుంచి కూడా ఇదే తరహాలో ఫస్ట్ లుక్ పోస్టర్ కనిపించింది. అదే పొగ, నోటిలో చుట్ట లాంటిది..
దీనితో మరోసారి అనుష్క ప్రభాస్ అభిమానులు రెండు పోస్టర్స్ పక్కన పెట్టి ఏం జరుగుతుంది అంటూ మాట్లాడుకోడం స్టార్ట్ చేశారు. అప్పుడు అంటే యాదృచ్చికం ఇది కూడా యాదృచ్చికమే అనుకోవాలా అంటూ మరికొందరు అంటున్నారు. ఇలా మొత్తానికి అయితే టాలీవుడ్ మోస్ట్ లవబుల్ జంట మరోసారి ఇలా హాట్ టాపిక్ అయ్యింది.


Click it and Unblock the Notifications











