జూ ఎన్టీఆర్ 'బృందావనం' పై మరో మారు ఎటాక్
జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'బృందావనం' చిత్రంపై మరోమారు తెలంగాణా వాదులు దాడి చేసారు. విధ్యార్ధి వేణుగోపాలరెడ్డి మృతికి నిరశనగా నిన్న(బుధవారం)బంద్ కి పిలుపునిచ్చారు. ఆ సందర్బంగా షూటింగ్ లు కూడా జరపరాదని నిర్ణయించారు. అయితే పాతబస్తీలో ఎన్టీఆర్ షూటింగ్ జరుగుతూండటంతో అక్కడికి వెళ్ళిన తెలంగాణా వాదులు దానిపై దాడిచేసారు. మరింత హంగామా చేయబోవటంతో పోలీసులు కల్పించుకుని ఆపుచేసారు. అనంతరం తెలంగాణాకు చెందిన లోకల్ లీడర్స్ కొందరు మధ్యవర్తిత్వం చేసి షూటింగ్ ను వారి దాడి నుండి రక్షించినట్లు సమాచారం.
ఇక ఈ 'బృందావనం' చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి తెలంగాణా ప్రాంతానికి చెందినవాడు కావటం, అలాగే నిర్మాత దిల్ రాజు తెలంగాణ వాడు కావటం ఈ షూటింగ్ ఆగకుండా ముందుకు జరగటానికి ప్లస్ అయింది. ఈ విషయమై మీడియాతో దర్శక, నిర్మాతలు గానీ, హీరో గానీ మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఇక వారు వెళ్ళిన తర్వాత వేరే ఏమీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీడీపీ నేతలు, స్ధానిక కార్పోరేటర్లు కాపు కాచారు. ఇంతకు ముందు కూడా బృందావనం షూటింగ్ ఆపుచేసి జై తెలంగాణా అనిపించిన సంగతి తెలిసింది. అంతేగాక ఎన్టీఆర్ అదుర్స్ రిలీజ్ విషయంలోనూ తెలంగాణా వాదులు గట్టి పట్టు పట్టారు.


Click it and Unblock the Notifications











