twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ బాలయ్య అదే ఫీట్ , ఏ హీరోకు ఇంత ఘనంగా..గ్రేట్

    By Srikanya
    |

    హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంలోని ఒక స్టిల్‌ విడుదలై, అభిమానులను ఆనందంలో ముంచెత్తోంది. ఆ స్టిల్ లో లో బాలకృష్ణ వీణ వాయిస్తున్నట్లు, ఆయనకు దర్శకుడు క్రిష్‌ సన్నివేశాన్ని వివరిస్తున్నట్లు కనిపించారు. చిత్ర యూనిట్ తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ స్టిల్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోని మీరు ఇక్కడ చూడవచ్చు.

    ఇక ఈ స్టిల్ చూడగానే అందరికి గుర్తుచ్చేది ఒకటే సినిమా. అదే భైరవ ద్వీపం. 1994లో సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో రూపొందిన భైరవ ద్వీపం చిత్రంలో కూడా బాలకృష్ణ ఇలాగే వీణ పట్టుకుని పాట పాడి, పెద్ద హిట్ కొట్టారు. మళ్లీ అదే ఫీట్ ని ఇప్పుడు బాలయ్య రిపీట్ చేయబోతున్నారు. దాంతో మళ్లీ భైరవద్వీపం స్దాయి హిట్ కొడతాడని అభిమానులు నమ్ముతున్నారు.

    ఈ సినిమా బాలయ్యకు వందవ చిత్రం కావడంతో నందమూరి అభిమానుల రచ్చ మామూలుగా లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పుకోవాలనేది బాలయ్య అభిమానుల కోరికగా . అది నిజమయ్యే లాగే ఉంది. మరిన్ని విశేషాలు క్రింద చదవండి.

    వంద పుణ్య క్షేత్రాల్లో

    వంద పుణ్య క్షేత్రాల్లో

    ఈ నేపథ్యంలో ఎన్‌.బి.కె. హెల్పింగ్‌ హ్యాండ్‌ జగన్‌ అండ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని 100 పుణ్య క్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చనతో పాటు 23 శివలింగాలకు రుద్రాభిషేకం, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

    శత పుణ్య క్షేత్ర జైత్ర యాత్ర

    శత పుణ్య క్షేత్ర జైత్ర యాత్ర

    భారతదేశ సర్వమత శత పుణ్య క్షేత్ర జైత్రయాత్ర బుధవారం నుంచి ప్రారంభమైంది. హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లు జెండా వూపి ఈ యాత్రను ప్రారంభించారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న నటిస్తున్న వందో చిత్రం కావడంతో ప్రతి కార్యక్రమాన్ని అభిమానులు వినూత్నంగా, విశేషంగా నిర్వహిస్తున్నారు.

    ఏ హీరోకు కూడా ఇలా..

    ఏ హీరోకు కూడా ఇలా..

    గతంలో 99 వాహనాలతో ‘డిక్టేటర్‌' చిత్రానికి స్వాగతం పలికిన ఎన్.బి.కె.హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అధినేత జగన అండ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నిర్వహిస్తున్నారు. తెలుగు సినిమాల్లో ఏ హీరోకు అభిమానులు ఇంత ఘనంగా వేడుకలను నిర్వహించలేదు. ఇలాంటి అరుదైన కార్యక్రమాలను నందమూరి అభిమానులు నిర్వహిస్తున్నారు.

    ఒకటా..రెండా..ఇరవై ఐదు

    ఒకటా..రెండా..ఇరవై ఐదు

    ఇప్పటికే ‘గౌతమిపుత్ర శాతకర్ణి' షూటింగ్ చాలా భాగం పూర్తయిపోగా.. గ్రాఫిక్స్ వర్క్ కూడా మంచి స్పీడ్ మీద జరుగుతోంది. ఏకంగా 25 వీఎఫ్ ఎక్స్ కంపెనీలు శాతకర్ణికి విజువల్ గ్రాఫిక్స్ అందిస్తున్నాయి.

    చాలా పెద్ద మొత్తమే గ్రాఫిక్స్ కు

    చాలా పెద్ద మొత్తమే గ్రాఫిక్స్ కు

    గౌతమిపుత్ర శాతకర్ణిలో గ్రాఫిక్స్ కోసం చాలా పెద్ద మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్ మొత్తం 55 కోట్లు కాగా.. ఇందులో 10 కోట్ల రూపాయలను కేవలం గ్రాఫిక్స్ పైనే వెచ్చించనున్నారని సమాచారం. తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ కు ఇది పెద్ద మొత్తమే కానీ.. నిజానికి ఈ స్థాయి చారిత్రక చిత్రానికి మాత్రం తక్కువే అంటున్నారు విశ్లేషకులు.

    పది కోట్ల బడ్జెట్ దానికే

    పది కోట్ల బడ్జెట్ దానికే

    సినిమాలో ఎక్కువగా యుద్ధ సన్నివేశాల్లోనే గ్రాఫిక్ విజువల్స్ ఉండేలా ప్లానింగ్ చేసారు. దాంతో .. 10 కోట్ల బడ్జెట్ తోనే ఈ ఎఫెక్ట్స్ పూర్తి కానున్నాయని తెలుస్తోంది. ఇక డిసెంబర్ రెండో వారం చివరకే.. శాతకర్ణి ఫస్ట్ కాపీ చేతిలోకి వచ్చేలా ప్లాన్ చేసుకున్న యూనిట్.. సంక్రాంతికి కు రావడం మాత్రం ఖాయం అని చెబుతున్నారు.

    అక్కడ కూడా ఓ రేంజిలో

    అక్కడ కూడా ఓ రేంజిలో

    ఇప్పటివరకూ యూఎస్ లో బాలయ్య కనీసం అర మిలియన్ మార్క్ ను కూడా టచ్ చేయలేదు. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని మిలియన్ డాలర్ క్లబ్ లో చేర్చేలా ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకోసం.. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు క్రిష్ కు ఓవర్సీస్ లో మంచి పేరు ఉంది. పైగా గౌతమిపుత్ర శాతకర్ణికి నిర్మాతలు... క్రిష్ తండ్రి, మరియు ఆయన స్నేహితుడు కావడంతో.. ఓవర్ సీస్ లో కలెక్షన్స్ కుమ్మేసేలా ప్లాన్ చేస్తున్నాడు .

    ఎక్కడా టెన్షన్ పడకుండా

    ఎక్కడా టెన్షన్ పడకుండా

    అనుకున్న సమయానికి దాదాపు 15-20 రోజుల ముందే గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ కాపీ చేతిలో ఉండేలా ప్రణాళికలు రూపొందించి, ఆ ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతుండడంతో.. సంక్రాంతి సెలవలను పూర్తిగా ఉపయోగించుకునేలా శాతకర్ణిని విడుదల చేయనున్నారని తెలుస్తోంది. బాలయ్య మూవీ అనుకున్న తేదీకంటే ముందుగానే వస్తోందని తెలియడంతో.. నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఆనంద పడిపోతున్నారు.

    చిరుతో ఢీ అంటే ఢీ

    చిరుతో ఢీ అంటే ఢీ

    రిలీజ్ డేట్ ను ముందుకు జరపాలంటూ అభిమానులు.. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి వచ్చిందని సమచారం. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రీపోన్ చేయడం కారణంగా.. చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్150 విడుదల తేదీనే.. బాలయ్య మూవీ కూడా థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి రేస్ ఇప్పుడు అదిరిపోయింది.

    స్పెషల్ షో వేస్తారు

    స్పెషల్ షో వేస్తారు

    ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ భారీగా చేపట్టనున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం కూడా స్పెషల్ గా ప్రదర్శించనున్నారట. జనవరి 3వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల కోసం ప్రత్యేకంగా షో వేయనున్నారని తెలుస్తోంది.

    శివరాజకుమార్

    శివరాజకుమార్

    'గౌతమిపుత్ర శాతకర్ణి'లో కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలో కీలక పాత్రలో నటించడానికి అంగీకరించిన కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌కి థ్యాంక్స్‌. స్వర్గీయ సూపర్‌స్టార్‌, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌కుమార్‌ గౌతమిపుత్ర శాతకర్ణితో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇప్పటి వరకు రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఏ ఇతర భాషా చిత్రాల్లో నటించలేదు. శివరాజ్‌కుమార్‌ నటించే సన్నివేశాలను దర్శకుడు త్వరలో చిత్రీకరించనున్నారు.

    వీళ్లందరూ కలిసే..

    శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హేమమాలిని, కబీర్‌ బేడీ, శివరాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్‌ భట్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ రోజే పుట్టిన రోజు

    ఈ రోజే పుట్టిన రోజు

    ‘గమ్యం', ‘వేదం', ‘కృష్ణం వందే జగద్గురుమ్‌', ‘కంచె'....చేసినవి నాలుగు మాత్రమే అయినా దర్శకుడిగా క్రిష్‌ ఆలోచనలేంటో ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. క్రిష్‌ సినిమాల్లో కథ, అందులోని సంఘర్షణ, వాటిలోంచి పుట్టుకొచ్చే భావాలలోనే కావల్సినంత హీరోయిజం ఉంటుంది. అందుకే.. తెలుగు చిత్రసీమలో క్రిష్‌ ముద్ర ప్రత్యేకంగా నిలిచింది. అలాంటి క్రిష్‌ మరో ప్రయత్నం ‘గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈరోజు క్రిష్‌ జన్మదినం. ఈ సందర్బంగా వన్ ఇండియా తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

    English summary
    On the occasion of director Krish birthday falling today, the unit of ‘Gauthami Puthra Satakarni’ released a new working still.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X