మళ్లీ నోరు జారిన చలపతిరావు.. రాజశేఖర్‌ను ఉద్దేశించి బూతు మాట

టాలీవుడ్‌లో సీనియర్ నటులైన చలపతిరావుకు ఎలాంటి ఫిల్టర్లు మాట్లాడటం అలవాటు. వేదిక ఏమిటి? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం? పక్కన ఎవరున్నారు అనే విషయం పట్టించుకోకుండా మాట్లాడి ఇబ్బందుల్లో పడిన దాఖలాలు చాలానే

By Rajababu

Recommended Video

Garuda Vega Movie Trailer Launch : Chalapathi Rao Funny Speech

టాలీవుడ్‌లో సీనియర్ నటులైన చలపతిరావుకు ఎలాంటి ఫిల్టర్లు మాట్లాడటం అలవాటు. వేదిక ఏమిటి? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం? పక్కన ఎవరున్నారు అనే విషయం పట్టించుకోకుండా మాట్లాడి ఇబ్బందుల్లో పడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.

నోరు జారిన చలపతిరావు

నోరు జారిన చలపతిరావు

మంగళవారం (అక్టోబర్ 18న) హైదరాబాద్‌లో జరిగిన పీఎస్ గరుడ వేగ ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా మరోసారి చలపతిరావు మాటలు జారాడు. కానీ వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకొన్నాడు. చలపతిరావు ఏమాట్లాడినది ఇదే..

డ్యాన్సులు చేయడానికి రాజశేఖర్

డ్యాన్సులు చేయడానికి రాజశేఖర్

యాక్షన్ సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో రాఘవేంద్రరావు అల్లరి ప్రియుడు చిత్రంలో హీరో రాజశేఖర్‌తో డాన్సులు చేయించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో డ్యాన్సులతో అలరించాడు. అయితే ఆ డ్యాన్సులు చేయడానికి రాజశేఖర్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.

ప్రవీణ్ సత్తారు మోకాళ్లపై

ప్రవీణ్ సత్తారు మోకాళ్లపై

మళ్లీ తాజాగా పీఎస్‌వీ గరుడ వేగ చిత్రంలో రాజశేఖర్ చేత దర్శకుడు ప్రవీణ్ సత్తారు మోకాళ్ల మీద డ్యాన్సులు చేయించాడు. పాపం రాజశేఖర్.. మోకాళ్లు ఏమైపోతాయో ఆలోచించుకున్నావా అంటూ ఆయన వైపు చూసి కామెంట్లు చేశాడు.

మోకాళ్లపై డ్యాన్సులు చేస్తావా

మోకాళ్లపై డ్యాన్సులు చేస్తావా

అంతేకాకుండా అలాగే చలపతిరావు మాటలను కొనసాగిస్తూ.. అసలు పని ఉందే మోకాళ్లతో. అలాంటిది నీవు మోకాళ్లపై డ్యాన్సులు చేస్తావా అని చురకలు అంటించాడు. దాంతో కార్యక్రమానికి హాజరైన వారందరూ గొల్లున నవ్వారు. దాంతో ఇదేదో మరి ప్రమాదం ముంచుకొస్తుందని గ్రహించిన చలపతి రావు వెంటనే కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మోకాళ్లు అంటే నడువటానికి అవసరం కదా. ప్రతీ మాటను తప్పుపట్టవద్దు అని అన్నారు. చలపతిరావు మాటలకు వేదిక మీద ఉన్న ప్రతీ ఒక్కరు గొల్లుగొల్లున నవ్వడం గమనార్హం.

గరుడ వేగ చిత్ర ట్రైలర్ అద్భుతం

గరుడ వేగ చిత్ర ట్రైలర్ అద్భుతం

తాను చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చే విధంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారుపై ప్రశంసల వర్షం కురిపించారు. పీఎస్‌వీ గరుడ వేగ చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉంది. మళ్లీ రాజశేఖర్‌కు మంచి రోజులు వస్తాయి అనే ఆకాంక్షను చలపతిరావు వ్యక్తం చేశారు.

చలపతిరావు గొప్పతనం ఇదే..

చలపతిరావు గొప్పతనం ఇదే..

అయితే ఈ సభలో చలపతిరావు గొప్ప తనానికి నిదర్శనంగా ఓ సంఘటన నిలిచింది. తన మాతృమూర్తిని కోల్పోయిన రాజశేఖర్‌కు చలపతిరావు తీవ్ర సంతాపం తెలుపుతూ చలించిపోయారు. రాజశేఖర్ మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరే విధంగా అందరం ఒక నిమిషంపాటు మౌనం పాటిద్దాం అని చెప్పడం ఆయన మంచితనానికి సాక్ష్యంగా నిలిచింది. చలపతిరావు సూచన మేరకు బాలకృష్ణతో సహా అందరూ మౌనం పాటించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X