ప్రియమణి బికినీ నీళ్ళల్లో తొలిగిన మ్యాటర్..
షూటింగ్ సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో ప్రియమణి బికినీ తొలగిపోయిందంటూ ద్రోణ సమయంలో వార్తలు వచ్చాయి. అయితే అందరూ వాటిని మర్చిపోయారు. అయితే తాజాగా ప్రవరాఖ్యుడు సినిమా ప్రమోషన్ లో బాగంగా మీడియాని కలిసిన ఆమెతో ఆ విషయం ప్రస్తావించి...ఆ వార్తల్లో నిజమెంత?..అంటూ ప్రశ్నించారు. దానికామె ఖంగుతిని ...భగవంతుడి దయ వల్ల ఇంత వరకు అలాంటివి ఏమీ జరగలేదు. నా జాగ్రత్తల్లో నేనుంటాను. అది రూమర్. అయినా ఇలాంటి విషయాల కంటే మా నటనలో తప్పొప్పులను గురించి ప్రస్తావిస్తే మా భవిష్యత్తుకూ మేలు చేసిన వారవుతారు కదా అంటూ సమాధానమిచ్చింది. అలాగే 'ప్రవరాఖ్యుడు' గురించి చెబుతూ..ఆ చిత్రం విడుదలైన మొదటి రోజే హైదరాబాద్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాను. ప్రేమలో పరిపక్వత ఉన్న కథ అది. దర్శకుడు మదన్ నా పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దారు. పైగా షూటింగ్ సమయంలో కూడా ముఖ కవళికల విషయంలో చాలా జాగ్రత్తలు చెప్పారు అంటోంది. ఇక ప్రస్తుతం ఆమె రవితేజ సరసన 'శంభో శివ శంభో', జగపతిబాబు సరసన 'సాధ్యం', 'రావణ్' (హిందీ, తమిళ్) చిత్రాలు చేస్తోంది. ఇవే కాక ఆమె పలు కన్నడ చిత్రాలు కూడా కమిట్ అవుతోందని వినికిడి.


Click it and Unblock the Notifications











