'పరమవీర చక్ర' ప్లాపుకీ మళ్ళీ షీలానే బలి చేస్తారా?
షీలాకి వరస ఫ్లాపులు తప్పటం లేదు. మొదటి సినిమా నుంచి పరుగు, మస్కా, పరమవీర చక్ర వంటి పెద్ద సినిమాల దాకా ఆమెవన్నీ ఫ్లాపు సినిమాలే. అయితే ఆ సినిమా ఏ కారణం వల్ల ఫ్లాప్ అయినా ఐరన్ లెగ్ షీలా అంటూ ఆమెపై నింద వేస్తున్నారు. ఇప్పుడు ఆమె తాజా చిత్రం పరమవీర చక్ర చిత్రంకీ అదే ప్రచారం చేస్తున్నారు కొందరు. కానీ ఆమె నటించిన అదుర్స్ చిత్రం మంచి విజయాన్నే సాధించింది కదా అన్న విషయం పట్టించుకోవటం లేదు. అయితే అదుర్స్ విజయం ఆమెకు ఏమీ ఆఫర్స్ తేలేకపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన చిత్రం పరమవీర చక్రనే. ఇక పరమవీర చక్ర చిత్రం ఫ్లాపుకి కారణం పరమ బోరు స్క్రిప్టే నని, దాసరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 150వ చిత్రం అంటూ ప్రచారం చేసిన ఈ చిత్రంలో విషయంలేక పోవటంతదో బాలకృష్ణ ఎంత కష్టపడినా ఫలితం లేకుండాపోయింది. అలాగే రకరకాల గెటప్స్ డైలాగ్స్ ఈ చిత్రంలో ఉన్నప్పటికీ చిత్రం ఆకట్టుకోలోకపోతోంది.


Click it and Unblock the Notifications











