మళ్లీ పూనమ్ కలకలం: 'కత్తి'నే కాదు ఆర్జీవిని వదల్లేదు?.. అంతా కలిసి చంపేస్తున్నారని!

Recommended Video

'కత్తి'నే కాదు..ఆర్జీవి ని వదల్లేదు !

క్లైమాక్స్‌కు చేరినట్లే చేరి.. కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది పవన్ ఫ్యాన్స్-మహేష్ కత్తి వివాదం. కోన వెంకట్ ఇచ్చిన డెడ్ లైన్ పూర్తయిపోయింది.. బాధ్యత తీసుకుంటానన్న వేణుమాధవ్ మళ్లీ సీన్ లోకి రాలేదు. పవన్ స్పందించడం కూడా దాదాపు అసాధ్యమని తేలిపోయింది. అయినా మహేష్ కత్తి వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో మరోసారి హీరోయిన్ పూనమ్ కౌర్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

 ఆర్జీవి-కత్తి డిబేట్:

ఆర్జీవి-కత్తి డిబేట్:

బుధవారం రాత్రి ఓ టీవి చానెల్ వేదికగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తిలతో 'గాడ్, సెక్స్&ట్రూత్'పై ఓ డిబేట్ నిర్వహించారు. ముందు నుంచి వర్మ ఐడియాలజీని ఇష్టపడే కత్తి.. 'జీఎస్‌టీ'ని ప్రశంసిస్తూనే ఉన్నారు. నిన్నటి డిబేట్ లోనూ ఆయన వర్మ 'జీఎస్‌టీ'ని సమర్థిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్త్రీకి శృంగార స్వేచ్చ ఉంటుందనే విషయాన్నే వర్మ చెబుతున్నట్లు కత్తి వాదించారు.

పూనమ్ ట్వీట్:

ఈ డిబేట్ ముగిసిన తర్వాత హీరోయిన్ పూనమ్ కౌర్ నుంచి అనూహ్య స్పందన రావడం గమనార్హం. భారతదేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్ స్టార్స్ చాలా గౌరవాన్ని పొందుతూ, మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని పూనమ్ తన ట్వీట్ లో వెల్లడించారు.

 అంతా కలిసి చంపేస్తున్నారు!..:

అంతా కలిసి చంపేస్తున్నారు!..:

ఒకవేళ సాధారణ యువతులు దేనిపై అయినా స్పందిస్తే మాత్రం.. సంబంధం లేని విషయాలను అంటగడుతూ లేని పోని నిందలు వేస్తున్నారు అని పూనమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒరకంగా అంతా కలిసి యువతుల ఆత్మను, మనసును, శరీరాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారని పూనమ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

 టార్గెట్ 'కత్తి':

టార్గెట్ 'కత్తి':

పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మహేష్ కత్తిని టార్గెట్ చేసిందే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆమె ఆర్జీవిని కూడా టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. అంతా కలిసి యువతుల ఆత్మను, మనసును, శరీరాన్ని చంపేస్తున్నారని ఆమె చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తే.. పరోక్షంగా ఆర్జీవికి కూడా కౌంటర్ ఇచ్చారనే అనుకోవాలి.

 ఇన్నాళ్లు మౌనంగా పూనమ్:

ఇన్నాళ్లు మౌనంగా పూనమ్:

పవన్ ఫ్యాన్స్-మహేష్ కత్తి మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో సీన్ లోకి పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కత్తిని 'ఫ్యాట్సో', 'బిచ్చగాడు' అంటూ ఆమె వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో.. ఆయన కూడా వ్యక్తిగతంగా ఆమెకు ఆరు ప్రశ్నలు సంధించారు. వాటిపై స్పందించని పూనమ్ ఇప్పటిదాకా మౌనం వహిస్తూ వచ్చింది. ఉన్నట్టుండి మళ్లీ ఇప్పుడు ట్వీట్ తో దుమారం రేపింది.

 ఆ ట్వీట్స్ తర్వాత.. మళ్లీ ఇప్పుడే:

ఆ ట్వీట్స్ తర్వాత.. మళ్లీ ఇప్పుడే:

ఈ విషయంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని, ఇది తన కెరీర్, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలని అప్పట్లో పూనమ్ ట్వీట్ కూడా చేశారు. అయితే ఆ వెంటనే ఆమె ట్వీట్స్ డిలీట్ చేయడంతో దానిపై కూడా పెద్ద చర్చే జరిగింది.

ఇంకెన్నాళ్లో..:

ఇంకెన్నాళ్లో..:

ప్రస్తుతానికైతే పవన్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి యుద్దం ట్విట్టర్ లోనే ఎక్కువగా నడుస్తోంది. ఎవరి మద్దతుదారులు వారికి అండగా నిలబడుతున్నారు. విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే ఉన్నారు. కత్తి మహేష్, కోన వెంకట్, హైపర్ ఆది, పూనమ్ కౌర్.. ఇలా వీరంతా ట్వీట్స్‌తో చేస్తున్న 'వార్' ఇంకెన్నాళ్లో?..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X