ప్రభాస్, అనుష్క పెళ్లికి రెడీ అవుతున్నారా.. ప్రభాస్ ఇంట్లో వాళ్ళు మాత్రం, కారణం ఇదే!
వెండి తెరపై సూపర్ హిట్ జోడి ప్రభాస్, అనుష్క కేంద్రంగా రూమర్స్ ఆగడం లేదు. ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అనుష్క అందాల తార. చాలా రోజుల నుంచి వీరిద్దరిపైనా పెళ్లి వార్తలు షికారు చేస్తున్నాయి. తామిద్దరం మంచి స్నేహితులం మత్రమే అని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం ఆగడంలేదు. వీరిద్దరి పెళ్ళికి తెరవెనుక ఏదో జరుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన అనుష్క.. దుబాయ్ లో ఉన్న ప్రభాస్ ని రహస్యంగా కలిసిందని ఏడాది చివర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ప్రభాస్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలపై భిన్నంగా స్పందిస్తున్నారు.
Recommended Video


సినీ ఇండస్ట్రీ నుంచి కాదు
ప్రభాస్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్, అనుష్క విషయంలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అంటున్నారు. ప్రభాస్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం లేదని అంటున్నారు.

కారణం అదే
ప్రభాస్, అనుష్క గురించి ఆగాకుండా రూమర్లు వ్యాపించడానికి కారణం ఉంది. వీరిద్దరూ కలసి నటించారు. సూపర్ హిట్ జోడి. వీరిద్దరికి పెళ్లి కాకపోవడంతో ఈ వార్తలు వ్యాప్తిస్తున్నాయని అంటున్నారు.

ప్రభాస్ ఇంట్లో ప్రయత్నాలు మొదలు
ప్రభాస్ సన్నిహితుల నుంచి మరో ఆసక్తికర సమాచారం కూడా అందుతోంది. ప్రభాస్ పెద్దలు కుదిర్చిన వివాహానికి సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. భీమవరంకు చెందిన ఓ విద్యాసంస్థల అధిపతి కుమార్తెని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ప్రభాస్ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలు పెట్టారట.

త్వరలోనే ప్రకటన
ఈ సంబంధం కుదిరితే ప్రభాస్ కుటుంబ సభ్యులు త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ వివాహం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.

అందరిలాగే అనుష్క కూడా
అనుష్కలాగే ప్రభాస్ కు చాల మంది సినీ ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారు. అందరితో అలాగే ఉంటాడు అని అంటున్నారు. కానీ వీరిద్దరి విషయంలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెబుతున్నారు.

అనుష్క వెండి తెరకు
భాగమతి చిత్రం తరువాత అనుష్క మరో చిత్రాన్ని సైన్ చేయలేదు. ప్రభాస్ మాత్రం ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్ట్ కు కూడా రంగం సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











