మళ్ళీ రిస్కీ స్టంట్స్ తో రచ్చ చేస్తున్న రామ్ చరణ్...!?
జనరల్ గా హీరోలందరూ డాన్స్ లకు, ఫైట్స్ కి, రిస్కీ స్టంట్స్ కి డూప్స్ చేయడానికి అసిస్టెంట్స్ ని పెట్టుకొంటారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఆ జినిక్స్ ని బ్రేక్ చేసి ఎవరి సపోర్ట్ లేకుండా తనే ఓన్ గా చేసి ఫ్యాన్స్ కి కొత్త ఉరవడిని కలిగిస్తుంటాడు. మగధీర లో బైక్ రైడింగ్, హార్స్ రైడింగ్, స్కై డైవింగ్ చేయడం అంటే నాకు చాలా సంతోషం అంటుంటాడు. నేను ఎక్కువగా డూప్ ని ఇష్టపడనని అంటున్న చరణ్ చూస్తే తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకొంటున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ" చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ శ్రీలంక, బ్యాంకాక్, చైనాలో జరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వెల్ ఫైట్ ని చిత్రీకరిస్తోంట ఈ యూనిట్. రామ్ చరణ్, విలన్స్ రౌడీలుపాల్గొనగా ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని సమాచారం.
చరణ్ తొలి చిత్రం 'చిరుత"లో రిస్కీ ఫైట్స్ తో తన సత్తా చాటుకున్న చరణ్, 'మగధీర" సినిమా కోసం కత్తి ఫైటింగులు బీభత్సంగా చేసేశాడు. 'ఆరెంజ్" సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా వున్నంతలో యాక్షన్ ఎపిసోడ్స్ స్టయిలిష్ గా రూపొందాయి. ఇక, 'రచ్చ" ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్ టైనర్ కావడంతో చరణ్ తో రిస్కీ ఫైట్స్ చేయించేస్తున్నారట.
తన తండ్రి చిరంజీవికి మాస్ ఆడియన్స్ లో వున్న ఫాలోయింగ్ నేపథ్యంలో చరణ్, అటు డాన్సుల్లోనూ..ఇటు ఫైట్స్ లోనూ రచ్చరచ్చ చేసేస్తున్నాడంటూ ఇన్ సైడ్ సోర్సెస్ నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. రచ్చ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందోగానీ, 'ఆరెంజ్" దెబ్బకి పడిపోయిన ఇమేజ్ ని నిలబెట్టుకోవాలంటే 'రచ్చ"తో చరణ్ మెగా హిట్ కొట్టాల్సిందే అందు కోసం చరణ్ ఎంత కష్టపడ్తున్నాడనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











