»   » ప్రభాస్‌ కాలిగోటికి సరిపోరు:, మెగాఫ్యామిలీ తో మహేష్ ని కూడా కలిపి వర్మ ట్వీట్లు

ప్రభాస్‌ కాలిగోటికి సరిపోరు:, మెగాఫ్యామిలీ తో మహేష్ ని కూడా కలిపి వర్మ ట్వీట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వర్మ మామూలుగా ఉంటే వర్మ లా అనిపించదేమో..! అందుకే ఎప్పుడూ ఆ మార్క్ పోనివ్వడు ఎవరేమనుకున్నా, డైరెక్ట్ గానే అన్నా తనేమనుకుంటాడో అదే చెప్పేస్తాడు, తర్వాత అది తప్పేమో అని తాను ఫీలైతే సారీ చెప్తాడు... సారీ చెప్పిన వెంటనే మరింత కాలే లాగా ఇంకో రెండు ట్వీట్లు పడేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మొదలయ్యింది ఈ రచ్చ.. మెగా హీరోలనూ మహేష్ బాబునీ కలిపి మరీ కెలికాడు ఇంక అభిమానులతో మళ్ళీ ఈ గొడవ ఎక్కడి దాకా పోతుందో వర్మకి కూడా తెలీదు

ప్రభాస్‌ కాలిగోటికి

ప్రభాస్‌ కాలిగోటికి

గురువారం విడుదలైన ‘బాహుబలి-2' ట్రైలర్‌ను విపరీతంగా ప్రశంసిన వర్మ, మరోసారి మెగాస్టార్‌, పవర్‌స్టార్‌, సూపర్‌స్టార్‌లను కించపరిచాడు. ప్రభాస్‌ కాలిగోటికి సరిపోవాలంటే వీరికి రెండున్నర జన్మలు పడుతుందని ఎద్దేవా చేశాడు. అలాగే మరిన్ని సంచలనాత్మక ట్వీట్లు చేశాడు.

మెగా హీరోలనే

మెగా హీరోలనే

నిన్న సాయంత్రం తన ట్వీట్లు మొదలు పెట్టిన వర్మ మొదట మెగా హీరోలనే టార్గెట్ చేసినట్టు అనిపించే ట్వీట్లతో స్టార్ట్ చేసాడు. ‘బాహుబలి-2' ట్రైలర్‌కి ప్రపంచమంతా జై కొడుతున్నా, టాలీవుడ్‌ మాత్రం సూపర్‌ సైలెంట్‌గా ఉండిపోయిందని, దానికి కారణం టాలీవుడ్‌.. కుళ్లు సముద్రంలో మునిగిపోవడమేనని విమర్శించాడు.

మెగా ఫ్యామిలీనే టార్గెట్

మెగా ఫ్యామిలీనే టార్గెట్

అలాగే ‘బాహుబలి-2' ట్రైలర్‌లో ప్రభాస్‌ చాలా అందంగా ఉన్నాడని, పదివేల మంది అమ్మాయిల కూడా ప్రభాస్‌ అందం ముందు దిగదుడుపేనని ప్రశంసించాడు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ లో టాలీవుడ్ అని పెట్టినా వర్మ ఉద్దేశం అన్యాపదేశంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసాడా అన్న అనుమానం కలిగింది. రాత్రికల్లా ఆ కంఫ్యూజన్ ఏం లేకుండా తాను ఎవరిని అన్నాడో డైరెక్ట్ గానే చెప్పేసాడు వర్మ.

కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్

కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్

ఎందుకంటే బాహుబలిని మెచ్చుకుంటూ పొద్దున్నే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు బాహుబలిని మెచ్చుకుంటూ ట్వీట్ పెట్టారు. దాంతో వాళ్ళని వదిలేసిన వర్మ ఒక్క మెచ్చుకోలు మాటకూడా చెప్పలేనందుకు కుళ్ళు లో మునిగిపోయారు అంటూ ఏకేసాడు.

నిజాయితీగా ఒప్పుకున్నాడు

నిజాయితీగా ఒప్పుకున్నాడు

కానీ వాళ్ళు మరేదైనా బిజీలో ఉన్నారేమో అనికూడా మనం అనుకోవచ్చు... కానీ అందరూ అలా అనుకోలేరు కదా ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఇప్పటివరకూ రామ్ గోపాల్ వర్మ కూడా సాధించలేనంత ఫేమ్ తెచ్చుకుంది. అయినా అందరి దృష్టిలో పెద్ద "ఈగోఇస్ట్" కూడా బాహుబలి సాధించిన విజయాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు, ప్రశంసించాడు...

సూపర్ స్టార్ మహేష్ ని కూడా

సూపర్ స్టార్ మహేష్ ని కూడా

అయితే సాయంత్రం ఇండైరెక్ట్ గా ఇచ్చిన డోస్ సరిపోదనిపించిందో వర్మ స్టైల్ తగ్గిందనిపించిందో గానీ ఈసారి డైరెక్ట్గా ఎటాక్ చేసాడు ఈ సారి సూపర్ స్టార్ మహేష్ ని కూడా కలుపుకుని మరీ పంచ్ విసిరాడు. ‘‘బాహుబలి-2' తర్వాత టాలీవుడ్‌లో పవర్‌ఫుల్‌ మెగా సూపర్‌స్టార్లందరికీ కూడా ప్రభాస్‌ కాలి గోటినందుకోవడానికి రెండున్నర జన్మలు పడుతుంది' అని ట్వీట్‌ చేశాడు.

ఘోరంగా ఫెయిల్‌ అయ్యి

ఘోరంగా ఫెయిల్‌ అయ్యి

అలాగే ‘టాలీవుడ్‌ పవర్‌ఫుల్‌ స్టార్లు నేషనల్‌గా ట్రై చేసి ఘోరంగా ఫెయిల్‌ అయ్యి రీజనల్‌ అయిపోయారు. ప్రభాస్‌ రెండు దెబ్బలతో ఇంటర్నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు' అని మరో ట్వీట్‌ చేశాడు. ఈ ఆఖరి ట్వీట్ మాత్రం బలంగానే తగిలేలాగా ఉంది. ఎందుకంటే బాలీవుడ్ క్లాసిక్ "జంజీర్" ని రీమేక్ చేయబోయి రామ్ చరణ్ తేజ్, సర్దార్ ని బాలీవుడ్ లో విడుదల చేసి పవన్ దెబ్బతిన్నారు..

అక్కుపక్షి

అక్కుపక్షి" వ్యాఖ్య

ఇంకాస్త వెనక్కి వెళితే "ది జెంటిల్ మేన్ సినిమా హిందీలో చేసి బాలీవుడ్ లోకి అడుగు పెడదాం అనుకున్న చిరంజీవి కూడా ఆప్రయత్నం లో దారుణమైన ఎదురు దెబ్బ తిన్నాడు. ఇప్పుడవన్నీ గుర్తు చేస్తూ వర్మ ఇలా ఆడుకున్నాడు. నాగబాబు చేసిన "అక్కుపక్షి" వ్యాఖ్యను బాగా సీరియస్ గా తీస్కున్నట్టున్నాడు వర్మ...

English summary
Ram gopal varma Tweets on Mega fyamily are became Hot Topic Varma Again Poked mega fans with New TweeTs, this Time He add Mahesh Babu Too
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu