»   » మళ్ళీ మెగా ఫ్యామిలీనే టార్గెట్టా..?? బాహుబలిని చూసి కుళ్ళుకుంటున్నారు అంటూ వర్మ ట్వీట్

మళ్ళీ మెగా ఫ్యామిలీనే టార్గెట్టా..?? బాహుబలిని చూసి కుళ్ళుకుంటున్నారు అంటూ వర్మ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆడే నోరూ తిరిగే కాలూ ఊరికే ఉండవంటారు ఈ సామెత మన రామ్‌గోపాల్ వర్మకి సరిగ్గా సరిపోతుంది. అంతా బాహుబలి మానియాలో ఉంటే పొద్దున్నే ఈ ట్రైలర్ అమ్మమ్మ లా ఉందీ అంటూ రెండు అర్థాలు వచ్చేలా పోస్ట్ చేసాడు. ఇక ఇప్పుడేమో "ప్రపంచమంతా బాహుబలిని మెచ్చుకుంటూంటే టాలీవుడ్ లో చాలామంది సైలెంట్ గా ఉన్నారు. బహుశా కుళ్ళుకుంటున్నారేమో" అంటూ వెటకారంగా ట్వీట్ పెట్టాడు.

అయితే ఇప్పుడు ఈ ట్వీట్ లో టాలీవుడ్ అని పెట్టినా వర్మ ఉద్దేశం అన్యాపదేశంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసాడా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే బాహుబలిని మెచ్చుకుంటూన్ పొద్దున్నే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు బాహుబలిని మెచ్చుకుంటూ ట్వీట్ పెట్టారు.

Again Ramgopal Varma pockd Mega Team??

ట్రైలర్ చూసిన హీరో జూ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...."ఇప్పటివరకు చూడని అనుభవం. ఈ ట్రైలర్ చూస్తుంటే మీ నాడి వేగం పెరిగిపోతుంది. ఊపిరి ఆగిపోతుంది. కను రెప్పను కూడా వేయాలనిపించదు. జక్కన్నా దిగ్రేట్" అంటూ తారక్ ట్వీట్ చేస్తే, బాహుబలి-2 ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉంది..ప్రభాస్, రానా, రాజమౌళి మరియు టీంకు కంగ్రాట్స్ అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేసారు. కానీ ఇప్పటివరకూ ఏ మెగా హీరో స్పందించలేదు, దాంతో ఇప్పుడు వర్మ ట్వీట్ మెగా ఫ్యామిలీ మీదేనా అన్న అనుమానమూ కలుగుతోంది...

అప్పుడే అక్కడ యాంటీ కామెంట్లూ పడ్దాయి.., "నిజమే..! టాలీవుడ్ లో మీలాంటోల్లు ఎక్కువయిపోయారు అంటూ ఒకరు పెడితే., "టాలీవుడ్ జనాలంతా నీలా బేవార్స్ గా కూచున్నారనుకుంటున్నావా" అంటూ మరొకరు వరుస కామెంట్లతో వర్మ మీద యుద్దానికి దిగారు. అయిత్వే వర్మని మెచ్చుకుంటూ నిజమే కదా మీరు ఎప్పుడూ ఇలా నే చెప్తారూ అంటూ కూడా కామెంట్లు రావటం గమనార్హం...

English summary
Ram gopal varma Tweets "Total world appreciates Bahubali but Tollywood people feeling jealous"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu