మళ్లీ రష్మిక బోల్డ్ నిర్ణయం.. ఇలాంటి సీన్స్ చేస్తావా అంటూ నేషనల్ క్రష్ పై ట్రోల్స్..
ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది నిర్మొహమాటంగా "పుష్ప 2" అని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం పుష్ప పార్ట్ 1 పెద్ద హిట్ కాగా ఆ సినిమాలో వీరిద్దరి జోడీ మరింత క్లిక్ అయ్యింది.
పుష్ప రాజ్ అండ్ శ్రీవల్లిగా ఇద్దరూ అదరగొట్టేయగా ఆన్ స్క్రీన్ వీరి కెమిస్ట్రీ హిట్ అయ్యింది. దీనితో పార్ట్ 2 లో కూడా వీరి కెమిస్ట్రీ కోసం చాలానే కామెంట్స్ వినిపించాయి. కాగా పార్ట్ 1 లో శ్రీవల్లిగా నటనతో పాటుగా రష్మిక తనలోని బోల్డ్ యాంగిల్ కూడా చూపించింది అని చెప్పాలి. మెయిన్ గా పార్ట్ 1 లో ఒక సీన్ ఇద్దరి నడుమ కార్ లో నడుస్తుంది. థియేటర్స్ లోనే ఈ సీన్ ఎంతో ఎబ్బెట్టుగా అనిపించింది. కాగా దీనికే చాలా మంది గట్టి కామెంట్స్ అప్పట్లో చేశారు.

దీనితో పుష్ప పార్ట్ 1 నుంచి ఆ సీన్ కూడా తొలగించారు. కానీ ఇపుడు మరోసారి రష్మిక మందన్నా అందరికీ షాకిచ్చింది అని చెప్పాలి. పార్ట్ 2 లో ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. కాగా వీటిలో రీసెంట్ గా మంచి హైప్ ని సెట్ చేసుకున్న సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా పీలింగ్స్ సాంగ్ అని చెప్పొచ్చు.
మలయాళ బీట్ తో ముందు లీక్ అయ్యిన ఈ సాంగ్ పట్ల మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి. సరే ఎట్టకేలకు ఫుల్ సాంగ్ బయటకు వచ్చింది కానీ ఈ ఒక్క సాంగ్ కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కంటే ఘోరంగా నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది అని చెప్పాలి. ఈ సాంగ్ వినేందుకు కూడా ఆ మలయాళ బీట్ తప్ప ఇంకేం లేదని ఒక క్లారిటీ కూడా అందరికీ వచ్చింది.

కానీ ఇందులోనే రష్మిక మందన్నా చూపించిన బోల్డ్ షో మాత్రం ఓ రేంజ్ హాట్ టాపిక్ గా మారింది. తనని మరీ బీ గ్రేడ్ నటిలా చూపించారని కొందరు అంటున్నారు. ఇక ఈ సాంగ్ లో ఇద్దరి నడుమ కొన్ని స్టెప్పులు అయితే దారుణంగా ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకటైతే రష్మిక మందన్నా ఎద స్థానంపై అల్లు అర్జున్ పడుతున్న బీట్ అయితే ఇంకా దారుణం అని ట్రోల్స్ మొదలయ్యాయి.
వీటితో పాటుగా అసలు అలాంటి స్టెప్పులకి రష్మిక ఎలా ఓకే చెప్పింది అని కూడా ఆమెపై విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సాంగ్ విషయంలో మరోసారి రష్మిక మందన్నా బోల్డ్ స్టెప్ తీసుకుందనే చెప్పాలి. అయితే ఇది పక్కా మాస్ ఆడియెన్స్ కి నచ్చవచ్చు ఏమో కాని ఫ్యామిలీ ఆడియెన్స్ కి మాత్రం కష్టమే అని చెప్పి తీరాలి.


Click it and Unblock the Notifications











