»   » ఇప్పట్లే త్రివిక్రమ్‌తో లేనట్లే

ఇప్పట్లే త్రివిక్రమ్‌తో లేనట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చాలా కాలం నుంచి త్రివిక్రమ్, మహేష్ బాబు హ్యాట్రిక్‌ మూవీ రాబోతోందని మీడియాలో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడిప్పుడే ఈ కాంబినేషన్ లేనట్లే అని తెలుస్తోంది.

అందుతున్న సమచారం ప్రకారం ...త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయడానికి మహేష్‌... అతని కోసం త్రివిక్రమ్‌ రెడీగా ఉన్నప్పటికీ టైమ్‌ మాత్రం కలసి రావడంలేదంటున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేష్‌.. త్రివిక్రమ్‌కు సమయం కేటాయించలేకపోతున్నాడని చెప్తున్నారు.

Again Trivikram-Mahesh film

వాస్తవానికి 'బ్రహ్మోత్సవం' పూర్తయ్యాక త్రివిక్రమ్‌ సినిమా ఉంటుందని అనుకొన్నారంతా. అయితే.. మధ్యలో మురుగదాస్‌ వచ్చి చేరాడు. బ్రహ్మోత్సవం తరవాత మహేష్‌- మురుగదాస్‌ల మూవీ ఖాయమయ్యేసరికి త్రివిక్రమ్‌ సినిమా వెనక్కి వెళ్లాల్సివస్తోంది. అంటే 2016లోనూ వీరి నుంచి సినిమా రాదన్నమాట.

మరో ప్రక్క త్రివిక్రమ్ సైతం వరస ప్రాజెక్టులు చేస్తు బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం పవన్ తో ఉండబోతోందని అంటన్నారు. ఇవన్నీ చూస్తూంటే కనీసం 2017లో అయినా హ్యాట్రిక్‌ చూస్తామో, లేదో? అంటున్నారు అభిమానులు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'అతడు', 'ఖలేజా'.

English summary
In 2016 Trivikram & Mahesh movie will be announced.
Please Wait while comments are loading...