సురేందర్ రెడ్డితో విభేదాలు.. 'ఏజెంట్' నిర్మాతలు క్లారిటీ.. అసలు విషయం ఏమంటే?

అఖిల్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అక్కినేని వారసుడు అఖిల్ ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ హిట్స్ పరంపర కొనసాగించాలనే భావనతో ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు ఏజెంట్ కాగా అందులో ఆయన ఒక ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో కొంత వివాదాలు నెలకొన్నాయని అంటున్నారు. ఈ విషయం మీద నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు

అనేక రకమైన కథనాలు

అనేక రకమైన కథనాలు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పూర్తి కాగానే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన అఖిల్ కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమా మీద భారీ అంచనాలు పెంచే విధంగా చేశాయి. అయితే గత కొద్ది రోజులుగా ఏజెంట్ సినిమా విడుదల విషయంలో అనేక రకాల ప్రచారాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ప్రచారం మొదలైన ఈ ప్రచారం వెబ్ మీడియాకు కూడా పాకడంతో అనేక రకమైన కథనాలు వచ్చాయి.

ఆందోళనతో

ఆందోళనతో

ఇంకా ఏజెంట్ సినిమా షూటింగ్ బాకీ ఉందని అయితే కొన్ని అనుకోని కారణాలతో ప్రొడక్షన్ టీంకి దర్శకుడు సురేందర్ రెడ్డికి విభేదాలు వచ్చాయి అని ప్రచారం జరిగింది. అందుకే షూటింగ్ విషయంలో అనుకున్న దానికంటే బాగా డిలే అవుతోందని, అందుకే ప్రకటించిన మేరకు ఆగస్టు నెలలో సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టాము, ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఇలా జరగడం ఏంటి అంటూ అక్కినేని అభిమానులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు.

అనుకున్నది అనుకున్నట్లుగా

అనుకున్నది అనుకున్నట్లుగా

ఈ నేపథ్యంలోనే ఏజెంట్ సినిమా ఆగస్టు నెలలో రావడం లేదు అంటూ జరుగుతున్న ప్రచారం మీద సినిమా యూనిట్ స్పందించింది.. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి జరుగుతున్న ప్రచారం గురించి నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా మన సినిమా ఆగస్టు నెలలో వస్తుంది అంటూ ఆయన ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఏజెంట్ గురించి వస్తున్న పుకార్లు నిజం కాదు, సినిమా విషయంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నాయి అంటూ అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చారు.

ఎలాంటి ఇబ్బంది లేదు

ఎలాంటి ఇబ్బంది లేదు

నిజానికి ఈ సినిమాకు నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరిస్తూ ఉండగా సహ నిర్మాతగా సురేందర్ రెడ్డి భార్య వ్యవహరిస్తున్నారు. నిర్మాణం విషయంలో కాస్త తేడాలు వచ్చాయి, అందుకే నిర్మాణం నుంచి సురేందర్ రెడ్డి భార్య తప్పుకున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. అయితే ఇప్పుడు అనిల్ సుంకర మాటలతో అది నిజం కాదని తేలింది. ఇక ఈ ఏజెంట్ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపిస్తారు.

ఆగస్టులోనే విడుదల

ఆగస్టులోనే విడుదల

ఇప్పటికే విశాఖలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అదే చివరి షెడ్యూల్ అవుతుందని, ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇక పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఆగస్టులో లైగర్ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా తమ సినిమా మీద నమ్మకంతో రంగంలోకి దిగడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారని తెలుస్తోంది. మరి చూడాలి ఏజెంట్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X