కాపీ రైట్ యాక్ట్ పై నిర్మాతల ఆందోళన
చిన్న నిర్మాతలను సర్వనాశం చేసేందుకు కాపీరైట్ యాక్టును అమలు లోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని చిన్న నిర్మాతల మండలి ఆందోళన కార్య్రకమాలు చేపట్టింది. ఈ మేరకు చిన్న నిర్మాతలంతా బుధవారం నుంచి హైదరాబాద్ లో నిరసన దీక్షలు చేపట్టారు. దీనిపై చిర్మాత మోహన్ మాట్లాడుతూ.....తాము సినిమా నిర్మించేటపుడు దర్శకులు, హీరోలు వారికి కావాల్సినంత రెమ్యూనరేషన్ తీసుకున్న తర్వాతే సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నారని, కాపీ రైట్ యాక్టు ద్వారా తామ తమ సొంత డబ్బులతో నిర్మించిన సినిమాలు భవిష్యత్ లో ఎక్కడా అమ్ముకునే అవకాశం లేకుండా పోతుందని, ఈ యాక్టు అమలులోకి వస్తే దర్శకులు, హీరోలకు సినిమా నిర్మాణ సమయంలోనే కాకుండా భవిష్యత్ లో వాటాలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందని, అలా జరిగే తాము చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వక్తం చేశారు. సినీరంగంలోని కొందరు పెద్దలు కుట్ర పూరితంగా, రాజకీయ పలుకుబడితో ఈ యాక్టును అమలులోకి తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టం అమలు కాకుండా వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరిగేలా దేశ వ్యాప్తంగా ఉన్న చిన్ననిర్మాతలంతా ఏకమై పోరాడాలని తెలుగు నిర్మాతలు పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











