»   » రిజిస్టర్ చేయించారు: పవన్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా?

రిజిస్టర్ చేయించారు: పవన్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Here Is The Pawan Kalyan's New Film Title పవన్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా?

  జల్సా, అత్తారింటికి దారేది లాంటి భారీ హిట్ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. టైటిల్ విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ప్రచారం జరుగుతోంది.

  ఇంజనీర్ బాబు, గోకుల కృష్ణుడు, దేవుడే దిగివచ్చినా ఇలా చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని రోజులుగా 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' అనేటైటిల్ ఖాయమయ్యే అవకాశం కనిపిస్తోంది.

  టైటిల్ రిజిస్టర్ చేయించారు

  టైటిల్ రిజిస్టర్ చేయించారు

  ‘అజ్ఞాతవాసి' టైటిల్ ను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ... సినిమా నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ అజ్ఞాతవాసి టైటిల్ ను ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించింది. దీంతో ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

  అంచనాలు భారీగా

  అంచనాలు భారీగా

  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరూ భారీగా క్రేజ్ ఉన్న స్టార్స్ కావడంతో హైప్ భారీగా ఉంది. ఈ సినిమాను 2018 జనవరి 10న విడుదల చేయాలని భావిస్తున్నారు.

  దీపావళికి ఫస్ట్ లుక్?

  దీపావళికి ఫస్ట్ లుక్?

  దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగోను రివీల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

  డిమాండ్ భారీగా...

  డిమాండ్ భారీగా...

  ఈ సినిమా రిలీజ్ ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. సాధారణంగా పవర్ స్టార్ సినిమా అంటేనే హైప్ ఓ రేంజిలో ఉంటుంది. దానికి త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తోడైతే బాక్సాఫీసు రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే, శాటిలైట్ రైట్స్‌కు భారీగా డిమాండ్ రావాల్సిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జెమినీ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రూ. 19.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం శాటిలైట్ రూపంలోనే ఈచిత్రానికి ఇంత భారీ రేటు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ డబ్బుతో ఓ మీడియం రేంజి తెలుగు సినిమా తీయొచ్చని చర్చించుకుంటున్నారు.

  ప్రీ రిలీజ్ బిజినెస్

  ప్రీ రిలీజ్ బిజినెస్

  మరో వైపు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగబోతోంది. ఇప్పటికే అన్ని ఏరియాలకు ముందస్తుగానే భారీగా థియేట్రికల్ రైట్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా.

  పవర్ స్టార్

  పవర్ స్టార్

  ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

  English summary
  It has been quite some time now that the news came out that Pawan’s new film has been named Agnathavasi. But nothing was confirmed till now by the makers.But, the latest update reveals that the makers, Harika and Haasini Creations have registered the title with the film chamber.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more