పవన్ బుగ్గ గిల్లి.. మురిపాలు కురిపిస్తున్న కీర్తీ సురేష్.. సోషల్ మీడియాలో వైరల్

By Rajababu

Recommended Video

పవన్ బుగ్గ గిల్లి.. మురిపాలు కురిపిస్తున్న కీర్తీ సురేష్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నది. ప్రత్యేకంగా రిలీజ్ చేస్తున్న పోస్టర్లు అభిమానులను ఊరిస్తున్నాయి. వరుసగా వదులుతున్న పోస్టర్లు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. తాజాగా కీర్తీ సురేశ్, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నది.

 అజ్ఞాతవాసి క్రేజీ లుక్‌తో

అజ్ఞాతవాసి క్రేజీ లుక్‌తో

అజ్ఞాతవాసి చిత్రంలోని ఓ క్రేజీ లుక్ ఇంటర్నెట్‌లో అలజడి చేస్తున్నది. ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ బుగ్గలను గిల్లుతూ కీర్తిసురేష్ చేస్తున్న అల్లరి పని అందరినీ ఆకట్టుకొన్నది. స్టైలిష్‌గా కనిపిస్తున్న పవన్ బుంగమూతి పెట్టుకొని ఉండగా కీర్తి సురేష్ గిల్లడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంటున్నాయి.

 ఎమోషన్స్, రొమాన్స్.. త్రివిక్రమ్

ఎమోషన్స్, రొమాన్స్.. త్రివిక్రమ్

పవన్ కల్యాణ్, కీర్తీ సురేశ్ లుక్‌ గురించి చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ స్పందించారు. అజ్ఞాతవాసి చిత్రంలో ఎమోషన్ ఉంది, రొమాన్స్ అంతకుమించి ఉంది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆతృతగా ఉంది అని అన్నారు.

 డిసెంబర్ 12న రెండో సింగిల్

డిసెంబర్ 12న రెండో సింగిల్

ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. చిత్రానికి అనిరుధ్ అందిస్తున్న సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ డిసెంబర్ 12న రిలీజ్ కానున్నది.

 జనవరి 10న అజ్ఞాతవాసి రిలీజ్

జనవరి 10న అజ్ఞాతవాసి రిలీజ్

అజ్ఞాతవాసి రిలీజ్ మరో 33 రోజులు మిగిలి ఉన్నాయి. 2018 జనవరి 10న సినిమా రిలీజ్ కాబోతున్నది అని త్రివిక్రమ్ ట్వీట్ చేశారు. పవన్, కీర్తి ఎంతో ఆకర్షణగా ఉండటంతో ఈ ఫోటో అలా సోషల్ మీడియాలో దర్శనమివ్వగానే ఇలా వైరల్ అయిపోయి తెగ చక్కర్లుకొడుతోంది.

 కీర్తీ సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్

కీర్తీ సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్

అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X