twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ చిత్రానికి కళ్లు తిరిగే శాటిలైట్ రేటు

    By Srikanya
    |

    హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ కాంబినేషన్ లో రూపొందుతున్న అగ్నిపధ్ చిత్రం జనవరి నెల 26న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ 41 కోట్లు చెల్లించి జీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. ఈ మొత్తం బాలీవుడ్ చరిత్రంలో ఓ పెద్ద రికార్డుగా అభివర్ణిస్తున్నారు. 1990లో అమితాబ్ హీరోగా, డాని డెంజోపా విలన్ గా నటించిన చిత్రం 'అగ్నిపధ్'కి ఇది రిమేక్. ఇందులో సంజయ్‌దత్ 'కంచా చీనా' పాత్ర చేస్తున్నాడు. ఇందులో విలన్‌ గా చేస్తున్న సంజయ్ దత్ ని చూస్తేనే విలన్‌కి కూడా వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాడు. విలన్ గా కనపడేందుకు సంజయ్ తలనీలాలు సమర్పించుకోవడమే కాక, చెవి పోగు కూడా పెట్టుకున్నారు. సినిమాలో చాలావరకు నలుపు రంగు దుస్తుల్లోనే కనిపిస్తారట.

    'లగే రహో మున్నాభాయ్' చిత్రంలో గాంధీగిరిని ఫాలో అయిన సంజయ్‌దత్ ఈ చిత్రంలో దాదాగిరి చేస్తున్నారని, ఆయన లుక్ డిఫరెంట్‌గా ఉంటుందని విన్నవారు ఈ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని గత కొంత కాలంగా ఆసక్తిగా ఎదురు చూశారు.లేటెస్ట్ గా సంజయ్ పుట్టినరోజు సందర్భంగా 'అగ్నిపథ్'లోని ఆయన లుక్‌కి సంబంధించిన ఫొటోని విడుదల చేశారు. అలాగే ఈ చిత్రంకోసం కత్రినాకపూర్ చేసిన చిక్నీ చమేలి పాట కూడా ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరుణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

    English summary
    Agneepath film satellite rights are sold for Rs41 Crs and this is bagged by Zee TV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X