లేటెస్ట్ మాస్ సినిమా స్పూర్తితో టీచర్ మర్డర్
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటించిన మాస్ చిత్రం అగ్నిపధ్ రీసెంట్ గా విడుదలై మంచి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ సినిమాలో ఇతివృత్తాన్ని ఇన్సిప్రేషన్ గా తీసుకుని చెన్నైలోని ఓ విద్యార్ది తన టీచర్ ని కత్తితో పొడిచి చంపాడు. ఈ విషయాన్ని చెన్నై పోలీసులు మీడియాకు తెలియచేసారు. వారు చెప్పిన దాని ప్రకారం ఆ విద్యార్ధి అగ్నిపధ్ చిత్రం చూసాడు. సినిమాలో హీరో తన తండ్రిపైన త్పపుడు ఆరోపణలు చేసిన వారిపై కత్తితో పొడిచి చంపి పగ తీర్చుకుంటాడు. ఆ దృశ్యం తనకు బాగా నచ్చిందని,దాన్నించే ప్రేరణ పొంది ఈ హత్యను చేసానని చెప్పాడు.
ఇక ఆ విద్యార్ది ఆ టీచర్ పై పగ పెంచుకోవటానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. ఆ విద్యార్ది లెక్కలు,హిందీ సబ్జెక్టులలో తప్పాడు. అయితే లెక్కలు భోధించే టీచర్ ఏమీ అనకపోయినప్పటికీ,హిందీ టీచర్ మాత్రం విద్యార్ది డైరీలో రిమార్కులు రాయటం ద్వారా కోపం తెప్పించింది. తనకు కోపం తెప్పించిన వారిపై పగ తీర్చుకోవాలని ఆ సినిమా ద్వారా తెలుగుకున్న ఆ పిల్లాడు..వెంటనే ఆ టీచర్ ని కత్తితో పొడిచాడు. హాస్పటిల్ కి తీసుకు వెళ్తూండగా ఆ టీచర్ మరిణించింది. ఇక ఆ కుర్రాడు వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే. తాము తీసే సినిమాలు ఇలాంటి దారణమైన సంఘటనలకు ఎలా దారి తీస్తున్నాయో ఇప్పటికైనా దర్శకులు,నిర్మాతలు తెలుసుకుని జాగ్రత్తపడాలని సామాజిక శాస్త్రవేత్తలు కోరుతున్నారు. అలాగే ఆ చిత్రానికి ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోకుండా పిల్లలను సైతం ధియోటర్స్ లోకి అనుమతిస్తున్నారు.


Click it and Unblock the Notifications











