వారి వల్లే వైరాగ్యం.. మీరంతా నా గుండెల్లో. కష్టాల్లో ఉంటే త్రివిక్రమ్.. అజ్ఞాతవాసి ఆడియోలో పవన్

By Rajababu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అభిమానుల హంగామా మధ్య ప్రారంభమైంది. హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న ఈ వేడుకకు ఫ్యాన్స్, సినీ వర్గాలు పోటెత్తాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వేదికకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ చిత్రంలో నిరాశ, నిస్పృహలతో ఉన్నప్పుడు నాకు త్రివిక్రమ్ అండగా ఉన్నారని తెలిపారు.

Recommended Video

అజ్ఞాతవాసిలో వెంకీ గెస్ట్ రోల్..!
 భారత్ మాతాకీ జై నినాదాలు

భారత్ మాతాకీ జై నినాదాలు

ఇంత ప్రేమను, అభిమానాన్ని సినిమా ద్వారా ఇచ్చిన మన దేశానికి వందనాలు తెలుపుదాం. భారత్ మాతాకీ జై అంటూ మూడుసార్లు నినాదం చేశాడు. అంతేకాకుండా ఫ్యాన్స్‌తో కూడా అనిపించాడు. లోనికి రాలేకపోయిన అభిమానులకు నేను క్షమాణాలు చెబుతున్నాను.

 హృదయంలో వైశాల్యం

హృదయంలో వైశాల్యం

నా హృదయంలో ఎంత వైశాల్యం ఉంటుందంటే.. అభిమానించే ప్రతీ ఒక్కరిని గుండెలో పెట్టుకొంటాను. కానీ నా శరీరం చాలా చిన్నది. నేను సినిమాలో ప్రవేశించినప్పడు ఇంత ఆదరణ లభిస్తుంది అని అనుకోలేదు.

 సమాజానికి సేవ చేయాలని

సమాజానికి సేవ చేయాలని

చిన్నప్పటి నుంచి సమాజానికి సేవ చేయాలని ఉండేది. కానీ సినిమా ద్వారా సమాజానికి సేవ చేసేందుకు చాలా అదృష్టం. సినిమా ద్వారా సమాజానికి సేవ చేసేలా జనసేన పార్టీని ప్రారంభించే అవకాశం లభించింది.

 ఖుషీ తర్వాత సినిమాలు

ఖుషీ తర్వాత సినిమాలు

ఖుషీ సినిమా తర్వాత సినిమాలు వదిలేద్దామని అనుకొన్నాను. కానీ మీ అభిమానం తర్వాత 25 సినిమాలు చేసే అవకాశం లభించింది. సినిమా ఫ్లాప్ అయినప్పడు కుంగిపోలేదు. విజయాలకు పొందిపోలేదు. జానీ ఫెయిల్ అయిన తర్వాత నాకు బాధపడలేదు. కానీ నా పక్కన ఉన్నవాళ్లు ప్రాణం పోయినట్టు బాధపడితే నాకు వైరాగ్యం వచ్చేది.

ఓటమితో బాధపడితే.. వైరాగ్యంలో

ఓటమితో బాధపడితే.. వైరాగ్యంలో

ఓటమితో బాధపడే వాళ్లను చూస్తే వైరాగ్యం చెంది నాకు నేను గోడ కట్టుకొన్నాను. వైరాగ్యంలో ఉన్న నన్ను బతికించింది అభిమానులే. నా పక్కన ఉన్నవాళ్లు ఎప్పుడు అండగా నిలువలేదు. కానీ మీరు మాత్రం నాకు ప్రేమను పంచారు. ప్రతీ ఒక్కరిని కలువాలని ఉంటుంది. కానీ నా గుండె ఎప్పడూ మీ కోసం కొట్టుకొంటుంది.

జాతీయ జెండా అంటే ఇష్టం

జాతీయ జెండా అంటే ఇష్టం

అభిమాని జాతీయ జెండా ఊపడాన్ని చూపిస్తూ.. నా అంతిమ లక్ష్యం జాతీయ జెండాకు గౌరవం కల్పించడమే. ఉడుతాభక్తిగా దేశానికి సేవ చేయడమే నా అంతిమ లక్ష్యం. కాలమే నాకు శక్తి ఇస్తుంది. నేను బలహీనుడ్ని. కాలం, భగవంతుడు నాకు శక్తి ఇస్తాడు. నాకు భయం ఉంటుంది. కానీ నిరాశ, నిస్ఫృహాలు ఉంటాయి.

 కష్టాల్లో స్నేహితులు వెంటలేరు

కష్టాల్లో స్నేహితులు వెంటలేరు

నాకు స్నేహితులు అనుకునే వాళ్లు వెంట నిలువలేదు. గెలుస్తున్నప్పుడు అందరూ ఉంటారు. ఓటమి చెందేటప్పుడు ఎవరూ ఉండరు. అన్ని సమయాల్లో మీరు తోడున్నారు. గోకులం సీతలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న త్రివిక్రమ్ అండగా ఉన్నాడు. సినిమాల్లోకి రావాలని విసిగించారు. జల్సా చిత్రంతో విజయం అందించారు. జల్సా విజయం మూడేళ్ల తర్వాత తెలిసింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అండగా

త్రివిక్రమ్ శ్రీనివాస్ అండగా

మీకు త్రివిక్రమ్ సలహాలు, సూచనలు ఇస్తారు అని అందరూ అంటారు. త్రివిక్రమ్ అంటే ఉన్నతమైన చదువు చదువుకున్న వ్యక్తి. స్వయంగా సిని పరిశ్రమలో ఎదిగారు. మా మధ్య ఉన్న మధ్య తరగతి అనుబంధం. నా రక్తం పంచుకొని పుట్టిన వారిని కోపంలో తిట్టలేను. కానీ త్రివిక్రమ్‌పై కోపగించుకోగలను. మా మధ్య అంత చనువు ఉంది.

 నిరాశ, నిస్ఫృహాలో ఉన్న నాకు

నిరాశ, నిస్ఫృహాలో ఉన్న నాకు

నిరాశ, నిస్ఫృహలొ ఉన్న నన్ను బయటకు తీసుకొచ్చిన వ్యక్తి. నేను చాలా కష్టసమయంలో ఉన్నప్పడు ప్రముఖ రచయిత గుంటూరు శేషేంద్రశర్మను పరిచయం చేశాడు. దాంతో నేను సాధారణ స్థితికి చేరుకొన్నాను. అంతటి మంచి విలువులు ఉన్న వ్యక్తి త్రివిక్రమ్ అన్నారు.

అప్పుడు స్టాలిన్.. ఇప్పుడు అజ్ఞాతవాసి

అప్పుడు స్టాలిన్.. ఇప్పుడు అజ్ఞాతవాసి

అప్పుడు స్టాలిన్.. ఇప్పుడు అజ్ఞాతవాసి కుష్బూ మాట్లాడుతూ.. తెలుగులో నా చివరి సినిమా స్టాలిన్. మళ్లీ తెలుగులో చేస్తున్న సినిమా అజ్ఞాతవాసి. అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ ఈ సినిమాలో నటించమని అడిగిన వెంటనే మరో మారు ఆలోచించకుండా ఒప్పుకొన్నాను. పవన్ కల్యాణ్ మితభాషి. కానీ ఓ మంచి మనసు ఉన్న వ్యక్తి.

పవర్‌స్టార్ పక్కన నిలచోవడం

పవర్‌స్టార్ పక్కన నిలచోవడం

పవర్‌స్టార్ పక్కన నిలచోవడం అను ఇమ్మాన్యూయేల్ మాట్లాడుతూ.. పవర్‌స్టార్ పక్కన నిలచోవడమే అది గొప్ప. అలాంటిది పవన్ కల్యాణ్ పక్కన నటించడం అదృష్టం. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం నా జీవితంలో మంచి అవకాశం. నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ నటించాలని ఉంది.

పవర్‌స్టార్ కావడం చాలా కష్టం

పవర్‌స్టార్ కావడం చాలా కష్టం

పవర్‌స్టార్ కావడం చాలా కష్టం స్టార్ కావడం చాలా కష్టం.. పవర్ స్టార్ కావడం మరీ మరీ కష్టం. అతడితో నటించడం చాలా సంతోషంగా ఉంది. నా తల్లి చిరంజీవి సరసన పున్నమినాగులో నటించింది. ఇప్పుడు నేను పవన్ కల్యాణ్‌తో నటించడం ఆనందంగా ఉంది.

అనిరుధ్ పెన్సిల్‌లా ఉంటాడు

అనిరుధ్ పెన్సిల్‌లా ఉంటాడు

అనిరుధ్ పెన్సిల్‌లా ఉంటాడు కానీ ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన చినబాబుకు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను పనిచేసిన దర్శకుల్లో మీరు చాలా మనసున్న వ్యక్తి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చూస్తే పెన్సిల్ ఉంటాడు. కానీ ఆయన వాయిస్ మ్యాజిక్. అను ఇమ్మాన్యుయేల్‌తో కెమిస్ట్రీ బాగా ఉంటుంది. స్క్రీన్ మీదే చూస్తే తెలుస్తుంది అని కీర్తి సురేష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X