అజ్ఞాతవాసి ఆడియో: పవన్ రాకతో దద్దరిల్లిన ఆడిటోరియం.. ఫ్యాన్స్ హంగామా
Recommended Video

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల కేరింతలు, హంగామా మధ్య అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అభిమానులతోపాటు భారీ ఎత్తున సినీ తారలు హాజరయ్యారు. ఈ వేడుక కోసం 8.24 గంటల ప్రాంతంలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వేదిక వద్దకు చేరుకొన్నారు.

కేరింతలతో పవన్‌కు ఆహ్వానం
పవన్ కల్యాణ్ సూట్, బూట్‌తో రాగా, త్రివిక్రమ్ మాములుగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ ఆడిటోరియంలోకి చేరుకోగానే అభిమానులు కేరింతలతో ఆహ్వనం పలికారు.

ఫ్యాన్స్‌కు పవన్ అభివాదం
ఆడిటోరియంలో తన కేటాయించిన సీట్లో కూర్చోవడానికి ముందు అభిమానులకు అభివాదం చేశారు. దాంతో వేదిక అరుపులు, కేరింతలతో దద్దరిలింది.

పవన్‌పై సాండ్ ఆర్ట్ ప్రదర్శన
అంతకు ముందు పవన్ సినిమాలకు సంబంధించిన థీమ్‌తో సాండ్ ఆర్ట్ కళాకారుడు తన ప్రతిభను బయటపెట్టాడు. ఈ షోను పవన్, త్రివిక్రమ్‌తోపాటు ఆడిటోరియంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఆసక్తిగా చూశారు.

తొలిపాట ఇలా ఆవిష్కరణ
తొలిపాటను మధురాపురి సాంగ్‌ను నిర్మాతలు భగవాన్, పుల్లారావు, మురళీశర్మ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. మధురానగరి పాటను పాడిన గాయని నిరంజనను వేదికపైకి ఆహ్వానించారు.

సంక్రాంతికి అజ్ఞాతవాసి కోడిపుంజు
ఈ సందర్భంగా నిర్మాతలు భగవాన్, పుల్లారావు మాట్లాడుతూ.. వచ్చే సంక్రాంతికి నిర్మాత రాధాకృష్ణ కోడిపుంజు అజ్ఞాతవాసి విజయం సాధిస్తుంది. మంచి కలెక్షన్లను సాధిస్తుంది అని అన్నారు.

రెండోపాట ఆవిష్కరణ ఇలా..
అజ్ఞాతవాసి సినిమాలోని గాలివాలుగా ఓ గులాబీ వాలి అనే సాంగ్‌ను రెండో పాటగా ఖుషీ సినిమా నిర్మాత ఏఎం రత్నం, టీవీ5 ఎండీ, ఆదిత్య మూవీస్ అధినేత ఉమేశ్ గుప్తా విడుదల చేశారు.

సిరివెన్నెల మార్కు మాటలు
పవన్ గురించి ఓ సినిమాలో గొప్పగా ఓ మాట రాశారు. అలాంటి పవన్ ముందు మాట్లాడటమంటే.. సునామీలో పిల్లనగ్రోవిని వాయించడమే. అలాంటి వ్యక్తి ముందు మాట్లాడటమంటే చాలా కష్టమైన పని అని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు.

ముందే లూటీ.. అదే బ్యూటీ
రావు రమేశ్ మాట్లాడుతూ షూటింగ్‌లో ఉన్నందున నితిన్ రాలేకపోయాడు. అతను శుభాకాంక్షలు తెలుపమని చెప్పాడు. ఈ చిత్రంలో నటించడం చాలా అదృష్టం. విడుదలకు ముందే ప్రేక్షకులను చేశాడు లూటీ.. అదే ఈ సినిమాలో బ్యూటీ అని అన్నారు.


Click it and Unblock the Notifications











