అజ్ఞాతవాసి ఆడియో : సంక్రాంతికి పవన్ కోడిపుంజు గెలుస్తుంది..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల కేరింతలు, హంగామా మధ్య అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అభిమానులతోపాటు భారీ ఎత్తున సినీ తారలు హాజరయ్యారు.
Recommended Video


జే మీడియా నిర్వహణ
అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జే మీడియా సంస్థ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.

8000 ఫీట్ల ఎల్‌ఈడీ స్క్రీన్
8000 ఫీట్ల ఎల్‌ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఇంత పెద్ద స్క్రీన్‌ను టాలీవుడ్ ఫంక్షన్‌కు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

గాయని నిరంజన నోట మధుర
పవన్ కల్యాణ్ పాటలను వీణా శ్రీవాణి తన వీణపై వాయించి అభిమానులను ఆకట్టుకొన్నారు.

నిర్మాతలు భగవాన్, పుల్లారావు
తొలిపాటను మధురాపురి సాంగ్‌ను నిర్మాతలు భగవాన్, పుల్లారావు, మురళీశర్మ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. మధురానగరి పాటను పాడిన గాయని నిరంజనను వేదికపైకి ఆహ్వానించారు.

సంక్రాంతికి అజ్ఞాతవాసి కోడిపుంజు
ఈ సందర్భంగా నిర్మాతలు భగవాన్, పుల్లారావు మాట్లాడుతూ.. వచ్చే సంక్రాంతికి నిర్మాత రాధాకృష్ణ కోడిపుంజు అజ్ఞాతవాసి విజయం సాధిస్తుంది. మంచి కలెక్షన్లను సాధిస్తుంది అని అన్నారు.

ఆకట్టుకున్న పవన్ సీన్ల పేరడి
పవన్ కల్యాణ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కొందరు ఔత్సాహికు నటులు పేరడి చేసి చూపించారు. లా కాంటెస్ట్ విజేతలను ప్రకటించారు.

ఆడియోకు వచ్చిన సినీ తారలు
ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారిలో కుష్బూ, కీర్తీ సురేష్, బోమన్ ఇరానీ, రావురమేష్, హరితేజ, తనికెళ్ల భరణి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, మురళీశర్మ, నిర్మాతలు భగవాన్, పుల్లారావు ఇప్పటికే వేదిక వద్దకు చేరుకొన్నారు. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

రెండోపాట ఆవిష్కరణ ఇలా..
అజ్ఞాతవాసి సినిమాలోని గాలివాలుగా ఓ గులాబీ వాలి అనే సాంగ్‌ను రెండో పాటగా ఖుషీ సినిమా నిర్మాత ఏఎం రత్నం, టీవీ5 ఎండీ, ఆదిత్య మూవీస్ అధినేత ఉమేశ్ గుప్తా విడుదల చేశారు.

రెండోపాట ఆవిష్కరణ ఇలా..
అజ్ఞాతవాసి సినిమాలోని గాలివాలుగా ఓ గులాబీ వాలి అనే సాంగ్‌ను రెండో పాటగా ఖుషీ సినిమా నిర్మాత ఏఎం రత్నం, టీవీ5 ఎండీ, ఆదిత్య మూవీస్ అధినేత ఉమేశ్ గుప్తా విడుదల చేశారు.

అనిరుధ్ లైవ్ ప్రదర్శన
అజ్ఞాతవాసి ఆవిష్కరణ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనిరుధ్ లైవ్ ప్రదర్శన ఇచ్చాడు. తన సంగీత బృందంతో కలిసి గాలివాలుగా.. ఓ గులాబీ వాలి అనే పాటను వేదికపై పాడుతూ పాటపాడి అభిమానులను ఆకట్టుకొన్నారు. ఈ పాటకు కుష్బూ, అను తలఊపుతూ కనిపించారు.

మూడోపాటగా ఏబీ ఎవరో నీ బేబి..
ఏబీ ఎవరో నీ బేబి అనే పాటను మూడో పాటగా ఆవిష్కరించారు. ఈ పాటపై అనిరుధ్ లైవ్‌గా ప్రదర్శించాడు. పాట పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ అనిరుధ్ ఫ్యాన్స్ పిచ్చెక్కించారు. ఈ పాటకు ముందు తనికెళ్ల భరణి ఓ కవితను వినిపించాడు. మితభాషి... అజ్ఞాతంలో ఉన్న అర్జునుడు ఈ అజ్ఞాతవాసి అనే విధంగా తన కవితను వినిపించాడు.


Click it and Unblock the Notifications











