పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా మరోసారి షాకిచ్చింది, 10 నెలల తర్వాత...
జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన 'అజ్ఞాతవాసి' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడిన సంగతి తెలిసిందే.
2018లో వచ్చిన అతిపెద్ద ప్లాప్ చిత్రాల్లో 'అజ్ఞాతవాసి' ఒకటిగా నిలిచింది. వెండి తెరపై మాత్రమే కాదు... బుల్లి తెరపై కూడా ఈ చిత్రం దారుణ పరాజయం పాలైంది. దీపావళి సందర్భంగా టీవీలో ప్రదర్శించగా... ఎవరూ చూడటానికి ఇష్టపడలేదని టీఆర్పీ రేటింగ్స్ బట్టి తెలుస్తోంది.

శాటిలైట్ రైట్స్ రూ. 19.5 కోట్లుకు
రిలీజ్ ముందే ‘అజ్ఞాతవాసి' శాటిలైట్ రైట్స్ ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ రూ. 19.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే టీవీ ప్రదర్శనలో కూడా దారుణమైన ప్లాప్ కావడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు.

టీఆర్పీ రేటింగ్ ఎంతంటే?
దీపావళి ఫెస్టివల్ సందర్భంగా 10 నెలల తర్వాత ‘అజ్ఞాతవాసి' తొలి సారి టీవీ ప్రీమియర్ వేయగా అత్యల్పంగా 5.3 రేటింగ్ మాత్రమే వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ సినిమాకు ఇంత దారుణమైన రేటింగ్ రావడంతో అందరూ షాకయ్యారు.

సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్
‘అజ్ఞాతవాసి' విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ సైతం సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన భవిష్యత్తులో సినిమాలు చేస్తారో? లేదో? అనే విషయం క్లారిటీ లేదు.

దీపావళికి సత్తా చాటిన గీత గోవిందం
కాగా... ఈ దీపావళికి విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం' చిత్రం టీఆర్పీ రేటింగ్స్ పరంగా సత్తా చాటింది. 20.80 రేటింగ్స్ సాధించి టాప్ పొజిషన్లో నిలిచింది.


Click it and Unblock the Notifications











