అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. అనిరుధ్‌పై మొదటి దెబ్బ?.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌లో డీఎస్పీ??

అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ మళ్లీ అందరికీ ఓ గుణపాఠం నేర్పుతున్నది. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రంపై అజ్ఞాతవాసి ప్రభావం భారీగానే పడే అవకాశం కనిపిస్తున్నది.

By Rajababu

Recommended Video

అనిరుధ్‌పై అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌లో డీఎస్పీ ??

సినిమా పరిశ్రమలో సక్సెస్ మీదే బంధాలు, సంబంధాలు ఆధారపడి ఉంటాయనేది కొత్త విషయం కాదు. అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ మళ్లీ అందరికీ ఓ గుణపాఠం నేర్పుతున్నది. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రంపై అజ్ఞాతవాసి ప్రభావం భారీగానే పడే అవకాశం కనిపిస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌లో మార్పులు చేర్పుల గురించి ఆసక్తికరమైన విషయాలు బాగానే వినిపిస్తున్నాయి. వాటిలో..

పేలవంగా అనిరుధ్‌ మ్యూజిక్

పేలవంగా అనిరుధ్‌ మ్యూజిక్

అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడానికి అనిరుధ్ రవిచందన్ మ్యూజిక్ ఓ కారణమనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ చిత్రంలో అతను ఉండకపోవచ్చు అనే మాట ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తున్నది.

 అనిరుధ్ మార్పుపై రూమర్స్

అనిరుధ్ మార్పుపై రూమర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మాస్. ఆయన చిత్రంలో డైలాగ్స్, పాటల్లో మాస్ ఎలిమెంట్స్ కనిపించకపోతే ప్రేక్షకులను మెప్పించలేము అనేది తెలిసిందే. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అనిరుధ్‌‌ను మార్చే ఆలోచనలో ఉన్నారనే వార్త మీడియాలో ప్రచారమవుతున్నది.

ఎన్టీఆర్‌కు మాస్ టచ్

ఎన్టీఆర్‌కు మాస్ టచ్

అజ్ఞాతవాసి చిత్రంలో అనిరుధ్ అందించిన పాటలు బాగానే ఉన్నప్పటికీ.. ఎక్కువగా క్లాస్ టచ్ కనిపించింది. వెస్ట్రన్ బీట్ ఎక్కువగా కనిపించింది. అలాంటి తరహా మ్యూజిక్ ఎన్టీఆర్ సినిమాకు సరిపడదు అని అంటున్నారు.

 త్రివిక్రమ్ సినిమాలో మార్పులు

త్రివిక్రమ్ సినిమాలో మార్పులు

ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో భారీ మార్పులే కనిపించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లోకి దేవీ శ్రీ ప్రసాద్ ఎంటరయ్యే అవకాశం ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ లేకపోవడం వల్లే అజ్ఞాతవాసి చిత్రం తేడా కొట్టిందని ఫ్యాన్స్ మండిపడిన సంగతి తెలిసిందే.

 వచ్చే‌నెల సెట్స్‌పైకి ఎన్టీఆర్

వచ్చే‌నెల సెట్స్‌పైకి ఎన్టీఆర్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఫిబ్రవరి మొదటివారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌లోకి దేవీ శ్రీ ప్రసాద్ వస్తాడా లేదా వేచి చూడాల్సిందే.

 త్రివిక్రమ్‌తో డీఎస్పీకి విభేదాలు

త్రివిక్రమ్‌తో డీఎస్పీకి విభేదాలు

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ టాక్ అందరిని టెన్షన్‌లోకి నెడుతుంటే.. దేవీ శ్రీ ప్రసాద్ బిందాస్‌గా టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ దేవీ శ్రీ ప్రసాద్ చేసి ఉంటే ఆయనపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండేది. అజ్ఞాతవాసి సినిమాకు ముందు దేవీ శ్రీ ప్రసాద్‌తో త్రివిక్రమ్‌కు విభేదాలు వచ్చినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X