twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరీ ఇలానా? బస్తాల్లో తరలిస్తూ కెమెరాకు చిక్కిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!

    By Bojja Kumar
    |

    పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే థియేటర్లన్నీ రచ్చ రచ్చ కావాల్సిందే. ఆయన నటించిన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' చిత్రం విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉండేలా ఉంది. గతంలో ఎన్నడూలేనంత క్రేజ్ ఈ సినిమాపై క్రియేటైంది. మరికొన్ని గంటల్లో ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రేపు వేలాది స్క్రీన్లలో ప్రదర్శించబడబోతోంది.

    కసిగా ఊగిపోతున్న ఫ్యాన్స్

    కసిగా ఊగిపోతున్న ఫ్యాన్స్

    సినిమా విడుదల దగ్గర పడటంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు పవర్ స్టార్ మేనియా పట్టుకుంది. సినిమా ఎప్పుడు చూద్దామా..? అనే కసితో ఉన్నారు. వారిని అదుపు చేయడం ఎవరితరం కావడం లేదు. పవర్ స్టార్‌ను తెరపై చూస్తే తప్ప వారు శాంతించే పరిస్థితి కనిపించడం లేదు.

    థియేటర్లు దద్దరిల్లాల్సిందే

    థియేటర్లు దద్దరిల్లాల్సిందే

    తొలి రోజు ప్రదర్శితం అయ్చే షోలలో అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ వీరాభిమానులే ఉంటారు. థియేటర్లన్నీ అరుపులతో దద్దరిల్లడం ఖాయం. కొన్ని థియేటర్లలో అభిమానులు చేసే గోలకు సినిమా డైలాగులు వినిపించక మళ్లీ మళ్లీ చూడాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు.

    టన్నుల కొద్దీ కాగితాలురేపు థియేటర్లో పవర్ స్టార్ బొమ్మ పడగానే గాల్లో పేపర్లు విసిరేందుకు టన్నుల కొద్దీ పేపర్లు కట్ అవుతున్నాయి. అభిమానుల అభిమానం దెబ్బకు థియేటర్లన్నీ చెత్త మయం కావాల్సిందే.

    టన్నుల కొద్దీ కాగితాలురేపు థియేటర్లో పవర్ స్టార్ బొమ్మ పడగానే గాల్లో పేపర్లు విసిరేందుకు టన్నుల కొద్దీ పేపర్లు కట్ అవుతున్నాయి. అభిమానుల అభిమానం దెబ్బకు థియేటర్లన్నీ చెత్త మయం కావాల్సిందే.

    రేపు థియేటర్లో పవర్ స్టార్ బొమ్మ పడగానే గాల్లో పేపర్లు విసిరేందుకు టన్నుల కొద్దీ పేపర్లు కట్ అవుతున్నాయి. అభిమానుల అభిమానం దెబ్బకు థియేటర్లన్నీ చెత్త మయం కావాల్సిందే.

    బస్తాల్లో తరలిస్తూ కెమెరాకు ఫోజులు

    బస్తాల్లో తరలిస్తూ కెమెరాకు ఫోజులు

    థియేటర్లలో విసిరేందుకు సిద్ధం చేసిన కాగితాల కట్టలను బస్తాల్లో తరలిస్తూ గర్వంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు అభిమానులు. తమలో కట్టలుతెగే రేంజిలో ఉన్న అభిమానాన్ని కొందరు గాల్లోకి పేపర్లు విసురుతూ బయట పెట్టబోతున్నారు.

    లెక్కల్లో బిజీ బిజీ

    లెక్కల్లో బిజీ బిజీ

    ఏ టిక్కెట్ ఎవడికి ఇవ్వాలి, ముందు వరుసలో ఎవడు ఉండాలి? వెనకాల ఎవడు ఉండాలి? అంటూ లెక్కలేసుకుంటూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు.

    యూఎస్ఏలో

    యూఎస్ఏలో

    యూఎస్ఏలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా అక్కడి అభిమానులు సందడి అంతా ఇంతా కాదు. ఆఫీసులకు సెలవులు పెట్టేసి మరీ సినిమా చూడటానికి సిద్ధమయ్యారు.

    కారు ర్యాలీ

    కారు ర్యాలీ

    పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా అక్కడి అభిమానులు కారు ర్యాలీ నిర్వహించి తమ హీరోపై అభిమానాన్ని చాటుకున్నారు.

    పిఎస్‌పికె 25

    పిఎస్‌పికె 25

    పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది 25వ సినిమా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అతిపెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

    చెన్నైలో బెనిఫిట్ షోల సందడి

    చెన్నైలో బెనిఫిట్ షోల సందడి

    చెన్నైలో కూడా ‘అజ్ఞాతవాసి' సినిమా బెనిఫిట్ షోలు వేస్తున్నారు. చెన్నైలో కూడా తెలుగు వారు, అందులోనూ పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చే అభిమానులు భారీగానే ఉంటారు.

    సంధ్య థియేటర్ వద్ద

    సంధ్య థియేటర్ వద్ద

    ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్స్ వద్ద భారీ హైట్ లో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కటౌట్.

    కటౌట్ గజ మాల

    కటౌట్ గజ మాల

    పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ కు వేయడానికి ప్రత్యేకంగా తయారు చేయించిన గజ మాల. రంగు రంగుల బుట్టలతో వీటిని తయారు చేశారు.

    సేవా కార్యక్రమాల్లో కొందరు ఫ్యాన్స్

    సేవా కార్యక్రమాల్లో కొందరు ఫ్యాన్స్

    పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా కొందరు అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలకు వీల్ చెయిర్ అందించారు.

    English summary
    Check out Agnyaathavaasi movie star Pawan Kalyan fans hungama photos. Agnyaathavaasi film directed by Trivikram Srinivas and starring Pawan Kalyan, with Keerthy Suresh, Anu Emmanuel, Kushboo, Aadhi Pinisetty and Boman Irani in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X