ఫ్యాన్స్‌కు పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్.. అజ్ఞాతవాసికి అదే బ్యూటీ

By Rajababu

Recommended Video

ఫ్యాన్స్‌కు పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రం వస్తున్నదంటే అదో మ్యాజిక్‌లానే ఉంటుంది. పంచ్ డైలాగ్స్, సున్నితమైన హాస్యంతోపాటు పవన్ పాడిన పాట అభిమానులకు బోనస్‌గా ఉంటుంది. తాజాగా న్యూ ఇయర్‌ సందర్భంగా ఫ్యాన్స్‌కు ఈ క్రేజీ కాంబినేషన్ ఓ గిప్ట్ ఇచ్చేదుందకు సిద్ధమైంది. ఇంతకీ అదేమిటంటే..

కాటమరాయుడా పాటతో

కాటమరాయుడా పాటతో

గతంలో అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ చేత త్రివిక్రమ్ పాడించిన కాటమరాయుడా.. కదిరి నరసింహుడా అనే పాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా అజ్ఞాతవాసి చిత్రం కోసం మరోసారి పవన్ గొంతు సవరించుకోకున్నారు.

 మరోసారి పవన్ గళం విప్పనున్న

మరోసారి పవన్ గళం విప్పనున్న

అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మరోసారి పాట పడబోతున్నారు. త్వరలోనే సంగీత దర్శకుడు అనిరుధ్ ఆయన చేత పాట పాడిస్తారు అని చెప్పారు.

డిసెంబర్ 31న పవన్ పాట రిలీజ్

డిసెంబర్ 31న పవన్ పాట రిలీజ్

అలాగే పవన్ పాడిన పాటను డిసెంబర్ 31వ తేదీన చిత్ర యూనిట్ విడుదల చేయాలని నిర్ణయించింది. నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న ఫ్యాన్స్, సినీ అభిమానులకు ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ అని సుమ పేర్కొన్నారు.

అజ్ఞాతవాసి జనవరి 10న రిలీజ్

అజ్ఞాతవాసి జనవరి 10న రిలీజ్

అజ్ఞాతవాసి చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మంగళవారం (డిసెంబర్ 19న) ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను నిర్వహించారు. జనవరి 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 పవన్‌కు ఇది 25వ చిత్రం

పవన్‌కు ఇది 25వ చిత్రం

పవన్‌ 25వ సినిమాగా ‘అజ్ఞాతవాసి' రూపుదిద్దుకుంటోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X