‘కొడకా కోటేశ్వర్ రావు’ సాంగ్ అదుర్స్: న్యూ ఇయర్ వేడుకల్లో మార్మోగుతున్న పవర్ సాంగ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి మూవీలోని 'కొడకా కోటేశ్వర్ రావు' సాంగ్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. పవర్ స్టార్ స్వయంగా పాడిన ఈ పాట మాస్ బీట్‌తో యువతను ఉర్రూతలూగిస్తోంది. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడ చూసినా ఇదే పాట మార్మోగి పోతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నారు. సాఫ్ట్ వేర్ ఆఫీసు బ్యాక్ డ్రాపుతో ఈ పాట సాగుతుంది.

పవర్ స్టార్ పాడిన పాటల్లో ఇదే టాప్
పవర్ స్టార్ ఇప్పటి వరకు తన సినిమాల్లో పాడిన పాటలన్నింటినీ బీట్ చేసే విధంగా ‘కొడకా కోటేశ్వర్ రావు' సాంగ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భాస్కర భట్ల సాహిత్యం, అనిరుధ్ బీట్స్ సూపర్
‘కొడకా కోటేశ్వర్ రావు' పాటకు ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ‘కొడకా కోటేశ్వరరావు ఖరుసైపోతవురోయ్.. పులస లాగా ఎగిరిపడితే పులుసై పోతవ్ రోయ్' అంటూ ఆయన అందించిన లిరిక్స్ ఫుల్ మాస్ టచ్‌లో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆ లిరిక్స్‌కు మరింత ఊపునిచ్చేలా అనిరుధ్ అదిరిపోయే బీట్స్ ఇచ్చారు.

న్యూ ఇయర్ వేడుకల్లో మార్మోగుతున్న సాంగ్, రికార్డులు ఖాయం
డిసెంబర్ 31న సాయంత్రం ఈ పాట విడుదల చేయడంతో..... తెలుగు రాష్ట్రాల్లో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో ఈ పాట మార్మోగుతోంది. పాట విడుదలైన కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూస్ సొంతం చేసకుంది. మున్ముంది ఈ పాట ఇంకెన్నిరికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

2018కి సరికొత్త ఆరంభం
పవన్ కళ్యాణ్ అభిమానులు ‘కొడకా కోటేశ్వరావు' పాటను రికార్డు స్థాయిలో హిట్ చేసి 2018 సంవత్సరానికి సరికొత్తగా ఆహ్వానం పలికేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అజ్ఞాతవాసి
అజ్ఞాతవాసి సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి సీజన్ కావడంతో రికార్డు స్థాయి వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు.


Click it and Unblock the Notifications











