ఏపీలో హద్దులే లేని ‘అజ్ఞాతవాసి’.... తెలంగాణలో అదుపు చేసిన కేసీఆర్, ఒక్కటిచ్చారు!

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం బుధవారం గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీగా, ఎక్కువ షోలతో విడుదలవుతున్న చిత్రాల్లో ఇదీ ఒకటి. ప్రజల్లో పవన్ స్టార్ మేనియా చూసి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం నిబంధనలు సడలించాయి. ప్రత్యేక అనుమతులు ఇచ్చాయి. దీంతో ఈ సినిమాకు కలెక్షన్ల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో హద్దులు లేని ‘అజ్ఞాతవాసి’

ఏపీలో హద్దులు లేని ‘అజ్ఞాతవాసి’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘అజ్ఞాతవాసి' సినిమా షోల ప్రదర్శనకు హద్దులే లేకుండా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సినిమా విడుదలైన వారం రోజుల పాటు రాత్రి, పగలు గ్యాప్ లేకుండా సినిమాలు వేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది.

ఏపీలో రోజూ ఎన్నీ షోలంటే...

ఏపీలో రోజూ ఎన్నీ షోలంటే...

సాధారణంగా అయితే ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు షోలు ఉంటాయి. అయితే రాత్రి 12 గంటల తర్వాత షోలు వేయడానికి, తెల్లవారు ఝామున మరో షో వేయడానికి... ఇలా మొత్తం 7 షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తెలంగాణలో కఠినంగా...

తెలంగాణలో కఠినంగా...

ఏపీ ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం ‘అజ్ఞాతవాసి' సినిమా పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించిందని చర్చించుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్లుగా రోజూ 7 షోలకు అనుమతి ఇవ్వాలని దర్శక నిర్మాతలు కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కరుణించలేదు.

పవన్ స్టార్ కేసీఆర్‌ను కలవడం వెనక

పవన్ స్టార్ కేసీఆర్‌ను కలవడం వెనక

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సినిమా విడుదల ముందు ఈ ఇద్దరి భేటీ జరుగడంతో ‘అజ్ఞాతవాసి' స్పెషల్ షోల కోసమే పవన్ కళ్యాణ్ వచ్చి కలిసాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

షాకిచ్చినట్లే ఇచ్చి కాస్త ఊరట ఇచ్చిన కేసీఆర్

షాకిచ్చినట్లే ఇచ్చి కాస్త ఊరట ఇచ్చిన కేసీఆర్

‘అజ్ఞాతవాసి' సినిమాకు తెలంగాణలో ఎలాంటి స్పెషల్ షోలకు అనుమతి లేదంటూ సోమవారం నుండి మీడియాలో ప్రచారం జరుగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే మంగళవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం నుండి ఊహించని ప్రకటన వచ్చింది. ఒక అదనపు షోకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వారం పాటు తెల్లవారు ఝామున ఒక అదనపు షోకు అనుమతి

వారం పాటు తెల్లవారు ఝామున ఒక అదనపు షోకు అనుమతి

తెలంగాణ ప్రాంతంలో వారం రోజుల పాటు ‘అజ్ఞాతవాసి' చిత్రానికి ఉదయం పూట ఒక అదనపు షోకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. దీంతో సాధారణంగా ప్రదర్శించే 4 షోల స్థానంలో 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి లభించినట్లయింది.

ఏపీ మాదిరిగా ఎందుకు అనుమతి ఇవ్వలేదు?

ఏపీ మాదిరిగా ఎందుకు అనుమతి ఇవ్వలేదు?

ఏపీలో మాదిరిగా తెలంగాణ ప్రాంతంలో రాత్రింభవళ్లు షోలు వేసుకోవడానికి అనుమతి నిరాకరించడానికి కారణం..... రాజకీయ పరమైన కారణాలే అయి ఉండొచ్చని అంటున్నారు.

అక్కడ బాలయ్య సినిమా వల్లే అనుమతా?

అక్కడ బాలయ్య సినిమా వల్లే అనుమతా?

ఏపీలో హద్దులు లేని అనుమతి ఇవ్వడానికి కారణం.... చంద్రబాబు బావమరిది బాలయ్య సినిమా ‘జై సింహ' విడుదల కూడా ఉండటమే అని, ‘అజ్ఞాతవాసి'కి ఇవ్వకపోతే ఆ సినిమాకు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని, ఆ కారణంతోనే అక్కడ అలా చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X