పవన్ ఫ్యాన్స్‌కు ఆరోజు పండగే: బ్లాస్టింగ్ న్యూస్ చెప్పిన అజ్ఞాతవాసి టీమ్..

గతంలో త్రివిక్రమ్‌తో చేసిన అత్తారింటికి దారేదిలో 'కాటమరాయుడా.. కదిరి నరసింహుడా..' అంటూ అభిమానులను ఉర్రూతలూగించిన పవన్ కల్యాణ్.. మరోసారి తన గాత్రాన్ని సవరించినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో చేసిన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' లోను పవన్ పాట పాడినట్లు సమాచారం. ఇప్పటిదాకా దీనిపై సస్పెన్స్ కొనసాగించిన చిత్ర యూనిట్.. తాజాగా దీన్ని ధ్రువీకరించింది.

Recommended Video

అజ్ఞాతవాసిలో వెంకీ గెస్ట్ రోల్..!
 న్యూ ఇయర్ కానుకగా:

న్యూ ఇయర్ కానుకగా:

అజ్ఞాతవాసిలో పవన్ కల్యాణ్ పాడిన పాటను స్పెషల్‌గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఈ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

 ఎలాంటి పాట:

ఎలాంటి పాట:

అజ్ఞాతవాసిలోను పవన్ పాట పాడారన్న విషయం తెలియడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. గతంలో అన్ని మాస్ తరహా పాటలు పాడిన పవన్.. ఈసారి ఎలాంటి పాట పాడి ఉంటారన్న ఆసక్తి వారిలో నెలకొంది.

అజ్ఞాతవాసి ఆడియో అంతా క్లాస్‌గా ఉన్న నేపథ్యంలో.. పవన్ కూడా క్లాస్ సాంగే పాడి ఉంటారా?.. లేక వైవిధ్యంగా క్లాస్-మాస్ రెండింటిని మిక్స్ చేసి పాడించారా? అన్న చర్చ జరుగుతోంది.

 గతం కన్నా భిన్నంగా:

గతం కన్నా భిన్నంగా:

ఆడియో రిలీజ్ కన్నా ముందే విడుదలైన 'బయటికొచ్చి చూస్తే..', 'గాలి వాలుగా..' లాంటి పాటలు అప్పటికే అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమాలో మిగతా ట్రాక్స్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది. అనిరుద్ అందించిన మ్యూజిక్.. కచ్చితంగా పవన్ కల్యాణ్ గత సినిమాల కన్నా భిన్నంగా ఉందనే చెప్పాలి.

 'తమ్ముడు'తో మొదలు:

'తమ్ముడు'తో మొదలు:

నటుడిగానే కాదు, సింగర్‌గాను పవన్ కల్యాణ్ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. తమ్ముడు సినిమాలో మొదటి సారిగా 'తాటి చెట్టెక్కలేవు .. తాటి కల్లు తీయలేవు' అనే పాటతో తన గొంతు సవరించుకున్న పవన్.. ఆ తరువాత జానీలో 'నువ్వు సారా తాగమాకురన్నా.. ' అనే పాటను పాడారు. ఇక అత్తారింటికి దారేదిలో 'కాటమరాయుడా..' పాటతో అభిమానులను ఒక ఊపు ఊపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X