పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ టీజర్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

By Bojja Kumar

Recommended Video

‘అజ్ఞాతవాసి’ టీజర్ డేట్ ఫిక్స్ ! ఎప్పుడో తెలుసా ? | Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబతోంది.

సినిమాకు సంబంధించిన న్యూ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ నెల 16న చిత్ర యూనిట్ నుండి సర్‌ప్రైజ్ రాబోతోంది.

టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు

టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు

‘అజ్ఞాతవాసి' సినిమా టీజర్ డిసెంబర్ 16వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఖరారు చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

 నేరుగా పాటల విడుదల, ఆడియో ఫంక్షన్ లేదు

నేరుగా పాటల విడుదల, ఆడియో ఫంక్షన్ లేదు

‘అజ్ఞాతవాసి' సినిమాకు ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటివి ఏమీ నిర్వహించడం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో నేరుగా ఆడియో మార్కెట్లోకి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

 హిట్ కాంబినేషన్

హిట్ కాంబినేషన్

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్టే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి' సినిమాతో వీరు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

 పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్

పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ నటిస్తున్నారు. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు.

సంక్రాంతి రిలీజ్

సంక్రాంతి రిలీజ్

హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2018జ నవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X