twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పండుగలా దిగివచ్చాడు.. పవరేంటో చూపించాడు..: ప్రీమియర్లకే 1మిలియన్ మార్క్..

    |

    'పండుగలా దిగివచ్చాడు.. పవరేంటో చూపించాడు..' పవన్ అభిమాన గణమంతా ఇప్పుడిదే పాట అందుకున్నారు. ఏ థియేటర్ వద్ద చూసినా పవన్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి నెలకొంది.

    సహజంగానే వపన్ అంటే అభిమానులకు ఓ మాయ. ఇప్పుడు ఆ మాయను తెరపై ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఇక అమెరికాలో అయితే తెరపై బొమ్మ పడకముందే అజ్ఞాతవాసి రికార్డుల ప్రభంజనం మొదలైంది.. ఆ రికార్డులేంటో చూద్దాం..

    మిలియన్ మార్క్:

    మిలియన్ మార్క్:

    అమెరికాలో అజ్ఞాతవాసి రికార్డుల వేట మొదలైంది. విడుదలవడమే ఆలస్యం.. సినిమా 1మిలియన్ గ్రాస్ అందుకోవడం విశేషం. కేవలం ప్రీమియర్ 'షో'లకే ఇంత స్థాయి కలెక్షన్స్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

    Recommended Video

    అజ్ఞాతవాసిపై 'మెగా' రిపోర్ట్ ?
    ఇదీ అంచనా:

    ఇదీ అంచనా:

    ప్రీమియర్ 'షో' కలెక్షన్స్ కేవలం 1మిలియన్ గ్రాస్‌కే పరిమితం కాలేదు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం.. ప్రీమియర్ కలెక్షన్స్ 1.5మిలియన్ గ్రాస్ అందుకోవచ్చని చెబుతున్నారు.

    అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనంఅమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

     'అజ్ఞాతవాసి' ఫీవర్:

    'అజ్ఞాతవాసి' ఫీవర్:

    పవర్ అభిమానులంతా ఇప్పుడు 'అజ్ఞాతవాసి' ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఏపీలో అర్థరాత్రి నుంచే 'షో'లు పడటంతో.. చలిని కూడా లెక్క చేయకుండా అభిమానులు థియేటర్ల వైపు 'క్యూ' కట్టారు. ఇక తెలంగాణలో నేటి ఉదయం 8గం.కు 'షో' పడుతుండటంతో థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే అభిమానుల కోలాహలం మొదలైంది.

    సెకండాఫ్ హైలైట్?:

    సెకండాఫ్ హైలైట్?:

    సినిమా చూసిన అభిమానులు 'అజ్ఞాతవాసి'లో సెకండాఫ్ హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. సెంటిమెంట్ తో పాటు ఆఫీస్ బ్యాక్ డ్రాప్ లో చూపించే సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు.

    థియేటర్ల వద్ద కోలాహలం:

    థియేటర్ల వద్ద కోలాహలం:

    పవన్ సినిమా మొదటి రోజు మొదటి ఆటకే చూసేయాలన్న ఉత్సాహం చాలామంది అభిమానుల్లో నెలకొంది. ఆ ఆత్రుతే థియేటర్ల వద్ద జన సంద్రాన్ని తలపిస్తోంది. సినిమాలో ఒక్క సీన్ కూడా మిస్ అయిపోవద్దన్న ఆసక్తితో కొన్ని గంటల ముందే వచ్చి థియేటర్ల ముందు క్యూ కట్టారు ప్రేక్షకులు.

     'అజ్ఞాతవాసి' పండుగ..:

    'అజ్ఞాతవాసి' పండుగ..:

    'అజ్ఞాతవాసి' సినిమా మొత్తంగా అభిమానులకు ముందే పండుగను తీసుకొచ్చిందని చెప్పాలి. సంక్రాంతి సీజన్ కు తోడు తెరపై అభిమాన హీరో బొమ్మను చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవిధంగా అభిమానులకు ఇదో డబుల్ ధమాకా.

    ఓపెనింగ్స్ అదిరిపోవడం పక్కా:

    ఓపెనింగ్స్ అదిరిపోవడం పక్కా:

    సినిమా పట్ల అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయి రివ్యూలు బయటకు వస్తే గానీ.. బాక్స్ ఆఫీస్ వద్ద 'అజ్ఞాతవాసి' ఎంతమేర రాణించబోతుందన్నది చెప్పడం కష్టం.

    కాగా, నేడు, రేపు దాదాపు తొంభై శాతం థియేటర్లలో 'అజ్ఞాతవాసి' సినిమానే ప్రదర్శించనున్నారు. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ దుమ్ములేచిపోవడం ఖాయం అంటున్నారు.

    English summary
    Marking the reunion of blockbuster combination of Pawan Kalyan and Trivikram Srinivas who had earlier delivered Attarintiki Daredi and Jalsa, the duo's Agnyaathavaasi is hitting the screens amidst mammoth expectations. The film has to make 4 Million USD for its break-even in the US.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X