అజ్ఞాతవాసి ఎంత పనిచేసింది?: అనుకు బిగ్ లాస్!, కానీ కైరాకు భలే కలిసొచ్చిందే!

ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్‌కు పెట్టింది పేరు. అవకాశాల విషయంలోనూ కొన్నిసార్లు టాలెంట్ కంటే సెంటిమెంటే ఎక్కువగా పనిచేస్తుంది. ఈ సెంటిమెంట్స్ వల్ల కొంతమందికి చేతిదాకా వచ్చిన అవకాశాలు మిస్ అయితే.. మరికొంతమందికి మాత్రం అనుకోకుండా అవకాశాలు వచ్చిపడుతాయి. హీరోయిన్లు అనుఇమ్మాన్యుయెల్, కైరా అద్వానీల విషయంలో ఇప్పుడిదే జరిగింది.

అనుపై అజ్ఞాతవాసి ఎఫెక్ట్;

అనుపై అజ్ఞాతవాసి ఎఫెక్ట్;

రాంచరణ్-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. షూటింగ్ తేదీ దగ్గరపడుతూ వస్తున్నా.. హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు.

తొలి నుంచి అనుఇమ్మాన్యుయేల్ పేరే ఎక్కువగా వినిపించినప్పటికీ.. అనూహ్యంగా కైరా అద్వానీ ఈ అవకాశాన్ని ఎగిరేసుకుపోవడం గమనార్హం. అయితే అజ్ఞాతవాసి డిజాస్టర్‌గా మిగిలిపోవడం వల్లే అనుకు ఈ ఛాన్స్ మిస్ అయిందంటున్నారు.

Recommended Video

ప్రీమియర్లకు 'నో'.. 'అజ్ఞాతవాసి'కి ఊహించని షాక్‌ !
మారిపోయిన ఈక్వెషన్స్:

మారిపోయిన ఈక్వెషన్స్:

నిజానికి కైరా కంటే అనుఇమ్మాన్యుయెల్‌కే క్రేజ్ ఎక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నిజానికి ఈ సినిమాతో తన కెరీర్ మరింత స్పీడ్ అందుకుంటుందని అనుఇమ్మాన్యుయేల్ కూడా భావించింది. కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్‌తో దెబ్బకు ఈక్వెషన్లు మారిపోయాయి.

కైరా లక్కీ గర్ల్..:

కైరా లక్కీ గర్ల్..:

కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్స్ కొట్టేస్తున్న కైరా అద్వానీ నిజంగా లక్కీ గర్ల్ అనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తున్న కైరా.. తదుపరి సినిమా కూడా పెద్ద హీరోతోనే దక్కించుకోవడం విశేషమే.

మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయితే..:

మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయితే..:

ఒక్కసారి మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయితే అవకాశాలకు కొదువ ఉండదనే వాదన ఉంది. ఈ లెక్కన కైరా అద్వానీకి గనుక అదృష్టం కలిసొస్తే భవిష్యత్తులో మరిన్ని బిగ్ ఆఫర్స్ వెంట వెంటనే ఆమె చేతిలో పడటం ఖాయం.

 కైరానే ఫిక్స్:

కైరానే ఫిక్స్:

రాంచ‌రణ్ - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది. ఫిలిం నగర్ వర్గాల ప్రకారం హీరోయిన్ గా కైరానే ఫిక్స్ చేశారని టాక్. ఇక సినిమా విషయానికొస్తే రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో గతంలోనే సినిమా రావాల్సి ఉన్నా చాలా ఆలస్యమే జరిగింది.

 అలా వెనక్కి తగ్గి..:

అలా వెనక్కి తగ్గి..:

అల్లు అర్జున్ - బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌రైనోడు సినిమా టాక్‌తో చ‌ర‌ణ్ వెన‌క్కి త‌గ్గాడని వార్త‌లు వ‌చ్చాయి. అయితే స‌రైనోడు అభిమానుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయినా సినిమా టేకింగ్ చ‌ర‌ణ్ కు న‌చ్చడంతోనే ఆయనతో పనిచేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X