ప్రియమణి ‘అంగుళీక’ ప్రారంభం(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రియమణి హీరోయిన్‌గా, దీపక్ హీరోగా నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో శ్రీ శంఖ చక్ర ఫిలింస్ పతాకంపై ప్రేమ్ ఆర్యన్ దర్శకత్వంలో కోటి తూముల, సి.హెచ్.రాంబాబు నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం 'అంగుళీక'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.

ఈ చిత్రం తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇవ్వగా, కాసాని జ్ఞానేశ్వర్ కెమెరా స్విచాన్ చేసారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్మాత సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకురాలు బి జయ, నటుడు సాయిరాం శంకర్ తదితరులు హాజరయ్యారు. జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వేసవికల్లా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని తెలిపారు.

ప్రియమణి ‘అంగుళీక’ ప్రారంభం(ఫోటోలు)

తొలి సన్నివేశానికి క్లాప్ కొడుతున్న బెల్లంకొండ

ప్రియమణి ‘అంగుళీక’ ప్రారంభం(ఫోటోలు)

కెమెరా స్విచాన్ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్

ప్రియమణి ‘అంగుళీక’ ప్రారంభం(ఫోటోలు)

చిత్ర యూనిట్ సభ్యులు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అతిథులు

 ప్రియమణి ‘అంగుళీక’ ప్రారంభం(ఫోటోలు)

దర్శకురాలు బి.జయతో సాయిరాం శంకర్ చిట్ చాట్

ప్రియమణి ‘అంగుళీక’ ప్రారంభం(ఫోటోలు)

నిర్మాతలు మాట్లాడుతూ...‘ప్రియమణి, దీపక్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్యన్ అతను చెప్పింది చెప్పినట్లు తీస్తాడనే నమ్మకంతో ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నాం. జనవరి మొదటి వారం నుండి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తాం, మార్చి వరకు షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేస్తాం. సినిమా కథకు తగిన విధంగా తిరుపతిలో ఓ భారీ సెట్ వేస్తున్నాం' అన్నారు.

దర్శకుడు ఫ్రేమ్ ఆర్యన్ మాట్లాడుతూ..'ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగే కథలో కాలచక్రంతో ముడిపడి ఉన్న ఇరువురి ప్రేమికుల కథ. జన్మాంతరాలు దాటి సాగే ఆత్మసంబంధాల ప్రేమ ప్రయాణంలో ప్రతి జన్మ ఓ మజిలీ. ఆ ప్రేమ జంటకు ఓ దుష్ఠాత్మ వలన విఘాతం ఎదురైతే ప్రళయంగా మారిన ప్రణయపు కథే ఈ అంగుళీక. నేను హిందీ దర్శకుడు మణిశంకర్ వద్ద రెండు సంవత్సరాలు పని చేసాను. తెలుగులో కూడా దర్శకత్వ శాఖలో ఐదు చిత్రాలకు పని చేసాను. స్వతహాగా నేను చిత్రకారుణ్ణి, యానిమేటర్ అయినందున నా మొదటి చిత్రం విజువల్ వండర్స్ క్రియేట్ చేయ్యాలని ఈ కథను ఎన్నుకున్నాను' అన్నారు.

ఇతర ముఖ్యపాత్రల్లో కోట శ్రీనివాసరావు, సుమన్ శెట్టి, మంజు భార్గవి నటిస్తున్నారు. ఈచిత్రానికి కెమెరా: చిట్టిబాబు, సంగీతం: శ్యామ్ ప్రసన్, మాటలు: గోపి, సుదర్శన్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: వెంకటేష్, ఫైట్ష్: దళపతి దినేష్, కో డైరెక్టర్: కస్తూరి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శశి, శివ సిర్రి, నిర్మాతలు: తూముల కోటి, సి.హెచ్.రాంబాబు, దర్శకత్వం: ప్రేమ్ ఆర్యన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X